బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ

Maoists threat to Chandrababu and nara Lokesh

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు లోకేష్‌పై మావోయిస్టులు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తాజాగా ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌లపై దాడులు తప్పవు అని మావోయిస్టు నేతలు ఒక లేఖ ద్వారా ప్రకటించారు. కోవర్టు ద్వారా ఆహారంలో విషం కలిపి ఇచ్చి, విషం వల్ల చనిపోయిన తమ వారిని ఎన్‌కౌంటర్‌ చేసినట్లుగా చెబుతున్నారు అని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది.

చంద్రబాబు నాయుడు కుటుంబంపై ఆత్మహుతి దాడికి సైతం తాము సిద్దంగా ఉన్నాం అని, అదును చూసి ఖచ్చితంగా దాడికి దిగుతాం అని మావోయిస్టు నేత శ్యామ్‌ అన్నారు. చంద్రబాబు ఫ్యామిలీని ఎల్లకాలం మిలిటరీ మరియు పోలీసులు కాపాడలేరు అని, అదును చూసి దాడి చేస్తాం అని మావోయిస్టు నేతలు హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యమ ద్రోహులను విద్రోహులుగా ప్రకటించి, విదేశీయులకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్న ఏపీ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలకు కూడా మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలతో బాబు కుటుంబ సభ్యులకు మరింత భద్రతను పెంచినట్లుగా తెలుస్తోంది.

కాగా ఈ మావోయిస్టుల కాల్చివేత మీద కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. యుపి ఎన్నికల సందర్భంగా మోదీ పాకిస్థాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ ను ఎలాగైతే వాడుకునే ప్రయత్నం చేశారో.. ఏపిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి చాలా కాలంగా మావోయిస్టుల కదలికలు లేవు.. ఎలాంటి దాడులకు పాల్పడలేదు.. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు మావోయిస్టుల మీద ఎన్ కౌంటర్ కు ఆదేశాలు జారీ చేశారు అని కూడా అందరూ చర్చించుకుంటున్నారు.

Related posts:
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
తెలంగాణకు ప్రత్యేక అండ
పోరాటం అహంకారం మీదే
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
సౌదీలో యువరాజుకు ఉరి
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్

Comments

comments