పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి

marriage stopped by demonetisation effect

మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశంలో వింతలకు తావిస్తోంది. అదేంటి వింతలు చోటుచేసుకోవడం ఏంటా అనుకుంటున్నారా? పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్ల కోసం జనాలు ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యుకడుతున్నారు. కొంత మంది చనిపోయారు కూడా.. కొన్ని పెళ్లిళ్లు కూడా ఆగిపోయాయి. ఇలాగే  దిల్లీలో కూడా నోట్ల రద్దుతో ఓ పెళ్లి ఆగిపోయింది. పెళ్లి ఆగిపోతే బాధపడాల్సిందిపోయి.. ప్రధాని మోడీకి థ్యాంక్యూ మోడీజీ అంటున్నారు. అదేంటి పెళ్లి ఆగిపోతే సంతోషమేంటి అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ చదవండి.

దేశ రాజధాని దిల్లీలో కవిత అనే యువతి లాయర్ గా ప్రాక్టీస్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం విక్కీ అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. డిసెంబర్ 9న వివాహం జరగాల్సి ఉంది. అయితే వరుడి కుటుంబీకుల ప్రవర్తన తేడాగా ఉండటంతో పెళ్లి రద్దు చేసుకోవాలనుకున్నారు. కానీ ఎలాగో తెలియలేదు. వరుడి కుటుంబీకులు కట్నం కోసం ఆశపడుతున్నట్టు అర్థమైంది. అదే సమయంలో పెద్ద నోట్లు రద్దు కావడంతో వరుడి కుటుంబం అన్నీ కొత్త నోట్లే కావాలన్నారు. కారు, సామాగ్రి కొనేందుకు కొంత సమయం కావాలని వధువు తరఫు వారు అడిగారు. కానీ అందుకు అంగీకరించిన వరుడి కుటుంబీకులు కారు, ఇతర సామాగ్రి కొనే వరకు పెళ్లి వాయిదా వేయాలని పట్టుబట్టారు. దీంతో వధువు తరఫు వాళ్లు పెళ్లి రద్దు చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో తన పెళ్లి ఆగిపోయినందుకు ఏ మాత్రం బాధ లేదని.. డబ్బు కోసం పెళ్లినే వద్దనుకున్న వ్యక్తి తనకు అవసరం లేదని.. ప్రధాని మోడీ నిర్ణయం వల్ల తనకు పరోక్షంగా మంచే జరిగిందని వధువు కవిత తెలిపింది. బాధలో కూడా ఆనందం అంటే ఇదేనేమో.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
గుజరాత్ సిఎం రాజీనామా
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
కృష్ణా పుష్కర భక్తులకు హెచ్చరిక: కృష్ణా జలాల్లో బ్యాక్టీరియా
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
2018లో తెలుగుదేశం ఖాళీ!
జగన్ సభలో బాబు సినిమా
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
బెంగళూరుకు భంగపాటే
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!

Comments

comments