భర్తను వదిలి ప్రియుడితో ప్రేమ.. ఇది 2016 లవ్‌స్టోరీ

Married Woman Love Story With Lover

ఫస్ట్ లవ్ ఎన్ని కాలాలైనా కూడా అలానే ఉంటుంది అని సినిమాలో డైలాగులు పేలుతుంటే అది ఏదో అనుకున్నాం. కానీ కొన్ని దారుణాలు జరిగుతుంటే అవుననే అనిపిస్తున్నాయి. ప్రేమించిన వాడి కోసం కట్టుకున్న వాడిని కాదనుకొని.. దేశం వదిలి వచ్చేసిన ఓ యువతికి జరిగిన అతి దారుణ ఘటన ఇది. ప్రేమ గుడ్డిది అని పెద్దలు అందుకే అంటారేమో.. వయసులో ఉన్నప్పుడు కలిగే ఆ ఫీలింగ్ కు అంతం అంటూ ఉండదు. కానీ ప్రేమించిన అమ్మాయికి ఆశలు కల్పించి చివరకు వచ్చిన తర్వాత ప్రేమ కంటే కట్నం కావాలని అడగడంతో ఆమెకు ఏం చెయ్యాలో పాలుపోక.. చివరకు ఆత్మహత్య చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన 2016 లవ్ స్టోరీ మీ కోసం…

ఆమె పేరు మానస. కృష్ణా జిల్లా వెంకటాపురానికి చెందిన మానస టెన్త్ క్లాస్ నుంచి హేమంత్ అనే యువకుడ్ని ప్రేమించింది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. కానీ పెద్దవాళ్లకు చెప్పే ధైర్యం చేయలేదు. ఇదే సమయంలో మంచి సంబంధం రావడంతో మానస తల్లిదండ్రులు ఓ ఎన్నారైతో ఆమె పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత చదువు పేరుతో కొన్నాళ్లు అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది. హేమంత్  తరచూ కలుస్తునే ఉంది. చదువు పూర్తి కావడంతో గత నెలలో మానసను అమెరికా పంపించారు ఆమె తల్లిదండ్రులు. ఇక్కడే అసలు కథ మొదలైంది.

అమెరికా వెళ్లినా కానీ తన ప్రియుడ్ని, అతని ప్రేమను మర్చిపోలేకపోయింది మానస. ఇదే విషయాన్ని ప్రియుడు హేమంత్ తో చెప్పింది. ఇండియా వచ్చేస్తే పెళ్లి చేసుకుందామని చెప్పడంతో భర్తతో తన ప్రేమ విషయం చెప్పింది. చేసేదేమీ లేని ఎన్నారై ప్రభాకర్ ఆమెను ఇండియా పంపించేశాడు. అయితే విషయం తెలుసుకున్న మానస తల్లిదండ్రులు పరువు తీశావంటూ ఇంట్లోకి రానివ్వలేదు. అదే సమయంలో ప్రేమించిన హేమంత్ కనిపించకుండా పోయాడు. ప్రియుడి ఆచూకీ కోసం మానస ఎంతో ట్రై చేసింది. అయినా కూడా అతడి జాడ తెలియలేదు. దాంతో చివరకు అతడి ఇంటికి వెళితే వాళ్లు మాత్రం కట్నం కావాలని అడగడంతో ఆమె షాక్ కు గురైంది.

చేసేదేమీ లేక బంధువుల ఇంట్లో తలదాచుకున్న మానస నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ప్రేమించిన హమంత్ ఫ్యామిలీ కావాలనే తనను, ప్రియుడ్ని కలవనివ్వడం లేదని, కట్నం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో ప్రియుడు హేమంత్ ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యాడు. తను మానసను పపెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు. మానస ఇండియా వస్తానని చెప్పింది కానీ… ఎప్పుడొచ్చేది చెప్పలేదని అందుకే రాలేకపోయానని చెప్పాడు. మరోవైపు తన తల్లిదండ్రులకు కూడా పెళ్లి ఇష్టమేనని.. కట్నం కోసం డిమాండ్ చేయలేదని చెప్పుకొచ్చాడు. చివరకు హేమంత్ పెళ్లికి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. 2016 లవ్ స్టోరీకి శుభం కార్డు పడింది.

Related posts:
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
సింగ్ ఈజ్ కింగ్
గుజరాత్ సిఎం రాజీనామా
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
అర్నాబ్ గోస్వామి రాజీనామా ఎందుకు? సోషల్ మీడియాలో వెరైటీ స్పందన
మావో నాయకుడు ఆర్కే క్షేమం
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
వంద, యాభై నోట్లు ఉంటాయా?
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
తమిళనాట అప్పుడే రాజకీయాలా?

Comments

comments