ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు

May elections will come before one in AndhraPradesh

ఏపిలో రాకీయం వేగంగా మారుతోంది. అక్కడి సర్వేలు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి వైసీపీ చేతిలో చావుదెబ్బ తప్పదు అని తేల్చేశాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అయితే వైయస్ జగన్ చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చే ఏడాది వరకు మాత్రమే ఉంటుంది అని అంటున్నారు. దేవుడు దయతలిస్తే వచ్చే ఏడాదే ఎన్నికలొస్తాయని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ఇలాంటి కీలక వ్యాఖ్యలు చెయ్యడం తెలుగు తమ్ముళ్లకు భయంపుట్టిస్తోంది.

ఎన్నికలు వస్తే ఏపిలో అధికారం ఎవరికి సొంతమవుతుంది అనే అంశంపై ఇప్పటికే చాలా సర్వేలు వచ్చాయి.దాదాపుగా అన్ని సర్వేలు(ఏబీఎన్ సర్వే తప్ప) చంద్రబాబు నాయుడుకు అధికారభంగం తప్పదని, వైసీపీ పార్టీకి తిరుగులేని మెజార్టీ సొంతమవుతుందని తేల్చేశాయి. ఈ నేపథ్యంలో జగన్ దూకుడు పెంచారు. ప్రజలకు మరింత చేరువుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా బుద్ధాలపాలెంలో బందరు పోర్టు బాధితులను పరామర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. ఎన్నికలొస్తే వైసీపీ గెలవడం ఖాయమని చెప్పారు. చంద్రబాబు చేస్తున్న అన్యాయాల పట్ల రైతుల అసహనంతో ఉన్నారని.. ఎన్నికల తర్వాత వచ్చేది మన ప్రభుత్వమేనని రైతులకు ధైర్యం చెప్పారు. పోర్టు కోసం300 ఎకరాలు చాలని ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు..ఇప్పుడు లక్షా 5 వేల ఎకరాలు అవసరమని చెప్పడం విడ్డూరమన్నారు. అసలు పోర్టు నిర్మాణానికి ఎన్ని ఎకరాలు కావాలో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
కుక్కలు ఎంత పనిచేశాయి
అతడి అంగమే ప్రాణం కాపాడింది
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
నయీం రెండు కోరికలు తీరకుండానే...
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
ఓడినా విజేతనే.. భారత సింధూరం
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
ఆ సిఎంను చూడు బాబు...
బెంగళూరుకు భంగపాటే
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
అకౌంట్లో పదివేలు వస్తాయా?
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
జయ మరణం ముందే తెలుసా?
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
భారీగా రిక్రూట్‌మెంట్ తగ్గించిన ఇన్ఫోసిస్

Comments

comments