251రూపాయల ఫోన్ ఇక రానట్లే

May Freedom251 phone not placed

కేవలం 251 రూపాయలకు మాత్రమే ఫోన్.. అవును మార్కెట్ లో దొరికే అన్ని ఫోన్ల కన్నా అతి చవకైన ఫోన్ ను కేవలం 251 రూపాయలకు మాత్రమే అందిస్తాం అని గతంలో వచ్చిన ప్రకటన చాలా మందికి గుర్తుండే ఉంటుంది. దేశం మొత్తానికి ఓ ఊపు ఊపేసింది ఆ ఒక్క ప్రకటన. ఫోన్ ల రంగంలో కొత్త శకానికి పునాది పడింది అన్న వాళ్లు ఉన్నారు.. కాదు ఇదేదో పెద్ద మాఫియాలా ఉంది అన్న వాళ్లు ఉన్నారు. మూడు నెలల్లో మీ ఫోన్లు మీ వద్దకు వస్తాయి అని నాడు హామీ ఇచ్చిన ఆ కంపెనీ ఇప్పుడు నిజంగా 251 రూపాయలకు ఇస్తుందా? అంటే అది మాత్రం అడగకండి అనేలా ఉంది పరిస్థితి.

రింగింగ్ బెల్స్ పేరుతో కేవలం 251 రూపాయలకే ఫోన్ లు అందిస్తామని వచ్చిన ఆ కంపెనీ ఇప్పుడు డైలమాలో ఉంది. దాంతో అసలు ఆ ఫోన్లు వస్తాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు కార‌ణం ఏమిటంటే.. ఈ సంస్థ లో వివాదాలు త‌లెత్తాయి. రింగింగ్ బెల్స్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు మోహిత్ గోయ‌ల్ ఆయ‌న సోద‌రుడు అన్మోల్ మ‌ధ్య గొడ‌వ‌లు చెల‌రేగిన‌ట్లు తెలుస్తోంది. దీంతో మోహిత్ సంస్థ నుంచి త‌ప్పకున్న‌ట్లు స‌మాచారం. మోహిత్ తో పాటు సంస్థ సీఈవో,  మోహిత్  భార్య ధార్న గోయల్  కూడా సంస్థకు రాజీనామా చేశారు. రూ.251కే స్మార్ట్ ఫోన్ క‌థ కంచికి చేరేలా క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం మోహిత్ సోద‌రుడు అన్మోల్ రింగింగ్‌బెల్స్ సంస్థ కంపెనీ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు.అలాగే అశోక్ చడ్దా కన్సల్టింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగనున్నట్టు కంపెనీ తెలిపింది. తమ సంస్థ  కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని  అన్మోల్‌ వెల్లడించారు. మోహిత్ మ‌రో సంస్థ‌ను ప్రారంభించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. 251రూపాయల స్మార్ట్ ఫోన్ ప్ర‌క‌ట‌న రింగింగ్ బెల్స్ సంస్థ ఇవ్వ‌గానే దాదాపు 7కోట్ల మంది ఈ ఫోన్ కోసం రిజిస్ట‌ర్ చేసుకున్నారు.  దీంతో సంస్థ అధికారిక వెబ్‌సైట్ కూడా క్రాష్ అయ్యింది. పాపం 251 రూపాయలకే ఫోన్ వస్తుంది అని అనుకున్న అనామకులకు మాత్రం తీవ్ర నిరాశే.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
ఇదో విడ్డూరం
క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
వీళ్లకు ఏమైంది..?
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
జియోకే షాకిచ్చే ఆఫర్లు
అమ్మకు ఏమైంది?
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
అకౌంట్లో పదివేలు వస్తాయా?
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
రాసలీలల మంత్రి రాజీనామా
రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments