క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ

May KCR will take classes to TRS leaders, MLAs, Ministers

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్ర పాలనపై దృష్టిసారించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. ఇప్పటికే పలు దఫాలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కేసీఆర్ త్వరలో అన్ని జిల్లాల పార్టీల అధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులను నియమించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే తీవ్ర కసరత్తు జరుగుతోంది. పార్టీ పటిష్టత,ప్రజాప్రతినిధులకు పరిపాలనలో మెళకువలు అందించటంలో భాగంగా ఇప్పటికే నాగార్జున సాగర్‌లో శిక్షణ తరగతులు నిర్వహించిన సీఎం కేసీఆర్..మరోసారి క్లాసులు నిర్వహించాలన్న యోచనలో ఉన్నారట.

ప్రజాసేవే పరమార్థమన్న భావనను ప్రజాప్రతినిధుల్లో పెంచడం..ప్రభుత్వ నిర్వహణలో ప్రజాప్రతినిధుల పాత్ర, శాసనసభలో హుందాగా వ్యవహరించడం, ప్రజలతో స‌త్సంబంధాలు కొన‌సాగించ‌డం, ప్రజలు మెచ్చేనేతగా ఎలా వ్యవ‌హ‌రించాలి అనే తదితర అంశాలపై పార్టీ సీనియర్ నేతలతో పాటు నిపుణులతో ట్రైనింగ్ క్లాసులు ఇప్పించనున్నారు. రాజ‌కీయ పాఠాల‌ను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే బోధిస్తార‌ని పార్టీ వ‌ర్గాల సమాచారం.

తర్వాత కొత్త జిల్లాల అధ్యక్షులు,పార్టీలోని అనుబంధ సంఘాల నేతలకు విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఇప్పించే యోచనలో ఉన్నారట. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి అయింది.. ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్ కు తిరుగులేదని సర్వేలు చెబుతున్నాయ్. కానీ టీఆర్ఎస్ లో చాలా మంది ప్రజా ప్రతినిధులకు ఇంకా ప్రభుత్వం పథకాలపై సరైన అవగాహన లేదు. ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఎమ్మెల్యేలకు మూడు రోజులు క్లాసులు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో అధికార పార్టీ నేతలు విఫలమవుతున్నారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలకు ఓ అవగాహన కల్పించాలనుకుంటున్నారు కేసీఆర్. కొత్త జిల్లాలో పాలన ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా క్లాసులు ఇవ్వనున్నారు. ఈ శిక్షణ తరగతులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పలు జిల్లాల నేతలు హాజరుకానున్నారు. ఈ దిపావలి తర్వాత నేతలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు.

Related posts:
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
గులాబీవనంలో కమలం?
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
తెలుగుదేశంలో ఆగష్టు భయం
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
అహా... అందుకేనా..?!
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
ఏపిలో జగన్ Vs పవన్
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బాబుగారి చిరు ప్లాన్
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!

Comments

comments