తెలంగాణకు కొత్త గవర్నర్

May new governor for newly state telangana

తెలంగాణ ఉద్యమం ప్రారంభైనప్పటి నుండి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ పోస్ట్ చాలా కీలకంగా మారింది. అప్పటి అనూహ్య పరిస్థితులను తట్టుకునేందుకు నాటి యుపిఎ ప్రభుత్వం గవర్నర్ గా నరసింహన్ ను నియమించింది. తెలంగాణ ఉద్యమం సాకారమై, రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉభయ రాష్ట్రాలకు గవర్నర్ గా నరసింహన్ ఉన్నారు. అయితే చాలా కాలం తర్వాత గవర్నర్ నరసింహన్ ను తొలగిస్తారా? నరసింహన్ ఇక తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ కాదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కొత్త గవర్నర్ రాబోతున్నారు అని రాజకీయ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది.

అవును, నాడు యుపిఎ ప్రభుత్వం నియమించిన గవర్నర్ నరసింహన్ ను ఇక ఒక రాష్ట్రానికే పరిమితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్లుగా ఆయనే రెండు రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయనే ప్రసంగిస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నరసింహన్ సన్నిహితంగా ఉంటున్నారు. రాష్ట్రాల విభజన నేపధ్యంలో నెలకొన్న సమస్యలను ఇద్దరు ముఖ్యమంత్రులతో చర్చిస్తూ సమస్య పరిష్కారం దిశగా నరసింహన్ అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో నరసింహన్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కేసీఆర్ కూడా గవర్నర్ ను తరచూ కలుస్తూ రాష్ట్ర సమస్యలను, సంక్షేమ పథకాల అమలును ఆయన దృష్టికి తెస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం గవర్నర్ నరసింహన్ కేసీఆర్ ను ఆయన కుమారుడు కేటీఆర్ ను పొగడటం విమర్శలకు తావిచ్చింది.

ఇలా గవర్నర్ ఓ పక్షానికి సపోర్ట్ చేయడం మీద బిజెపి నాయకులు లోలోపల రగిలిపోతున్నారని సమాచారం. గవర్నర్ మీద కాంగ్రెస్, సీపీఐలు బహిరంగంగానే గవర్నర్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటిదాకా నరసింహన్ మీద ఎలాంటి మచ్చాలేకున్న్నా ఎన్నికల టైం దగ్గర పడుతున్నందున …  కేంద్రం కొత్త గవర్నర్ నియామక ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో తెలంగాణకు కొత్త గవర్నర్ ను నియమించనున్నారు. కర్ణాటకు చెందిన బీజేపీ సీనియర్ నేత శంకరమూర్తిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమించనున్నారని చెబుతున్నారు. నరసింహన్ ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా కొనసాగించనున్నారు. తెలంగాణతో పాటు తమిళనాడుకు కూడా కొత్త గవర్నర్ ను నియమించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుత తమిళనాడు ఇన్ ఛార్జి గవర్నర్ గా వ్యవహరిస్తున్న విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలు కూడా చూస్తున్నారు.

Related posts:
అమావాస్య చంద్రుడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
అమిత్ షా రేస్ లో... తుస్
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
చంద్రబాబు నెంబర్ వన్..
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
నింద్రాప్రదేశ్
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
నయిం కేసులో పెద్ద తలకాయలు
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments