ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!

paytm

భారత ఆర్థిక వ్యవస్థ క్యాష్ లెస్ దిశగా అడుగులు వేస్తోంది. మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత నగదుకు కాలం చెల్లిపోయింది. పెద్దమొత్తంలో డబ్బులు కావాలంటే దొరకని పరిస్థితి. అయితే డిజిటలైజేషన్ లో భాగంగా భారత్ క్యాష్ లెస్ ఎకానమీ వైపు అడుగులు వేస్తోంది. మోదీ పెద్దనోట్ల నిర్ణయాన్ని రద్దు చేసిన తర్వాత అందరికి నగదు అందుబాటును కూడా తగ్గించేశారు. దాంతో అకౌంట్ లో డబ్బులు ఉన్నా కానీ చేతిలో మాత్రం డబ్బులులేని పరిస్థితి. దాంతో ఏమీ కొనలేని స్థితి. అయితే దీన్ని ఓ అవకాశంగా వాడుకుంటోంది పేటిఎం. చేతిలో నగదు లేకుండా పేటిఎం ఉంటే చాలు అన్ని రకాల లావాదేవీలను చాలా సాఫీగా సాగించవచ్చు అని పేటిఎం ఆఫర్ చేసింది.

మోదీ తీసుకున్న ఒక్క నిర్ణయంతో భారత్ మొత్తం అతలాకుతలమైతే ఒక్క పేటిఎం మాత్రం తెగ సంబరాలు చేసుకుంది. దేశంలో నగదు లేకుండా అన్ని రకాల పేమెంట్లను చేసుకునేందుకు పేటీఎం అవకాశం కల్పిస్తోంది. దాంతో పేటిఎంకు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. మార్కెట్ లో కూడా పేటిఎం చాలా స్పీడుగా పాగా వేసింది. అయితే ప్రస్తుతం నెంబర్ వన్ గా సాగుతున్న పేటిఎంకు ఆ కంపెనీ రాకతో దెబ్బపడుతుంది అని మార్కెట్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. పేటిఎం ద్వారా పేమెంట్ చేసే వారు ఇక మీదట ఆ కంపెనీ వ్యాలెట్ కు మారతారు అని చర్చసాగుతోంది. ఇంతకీ పేటిఎంను దెబ్బతీసే రేంజ్ లో ఏ కంపెనీ ఈ-వ్యాలెట్ అందుబాటులోకి వస్తుంది అనేగా మీ అనుమానం? అయితే మొత్తం చదవండి.

పేటిఎంను ఇప్పుడున్న లీడింగ్ పొజిషన్ లో పోటీపడగలిగే కంపెనీ అంటే అది ఖచ్చితంగా ముఖేశ్ అంబానీ కంపెనీనే. టెలికాం రంగంలో జియోను తీసుకువచ్చి.. అన్ని టెలికాం కంపెనీలకు చుక్కలు చూపుతున్న ముఖేశ్ తాజాగా ఈ-వ్యాలెట్ కు సిద్ధమవుతున్నారు. జియో దెబ్బతో మార్కెట్ లో అప్పటిదాకా లీడింగ్ లో ఉన్న అన్ని కంపెనీలకు దిమ్మతిరిగేలా చేశారు. జియో దెబ్బను తట్టుకోలేని కొన్ని కంపెనీలు మరో కంపెనీలో విలీనం అయ్యాయి. ఇప్పుడిక ఈ-వ్యాలెట్ విషయంలోనూ అలాంటి సీనే కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖేశ్ అంబానీ స్వాగతించారు. మోదీ స్టార్ట్ చేసిన డిజిటల్ ఇండియాలో తమ వంతు అని జియో ద్వారా ఫ్రీగా నెట్ సౌకర్యాన్ని అందించారు ముఖేశ్. మరి తాజాగా క్యాష్ లెస్ ఎకానమీ వైపు అడుగుల్లో భాగంగా జియో నుండి ఈ-వ్యాలెట్ ను అందిస్తామని ఆయన ప్రకటించారు. పేటిఎం ఇప్పటికే చాలా వరకు మార్కెట్ లో విస్తరించి ఉంది. అయితే పేటిఎం కంటే ఆఫర్లు ఎక్కువగా, సులువుగా లభిస్తే మాత్రం ఈ-వ్యాలెట్ కు డిమాండ్ పెరుగుతుంది. ముఖేశ్ వేసే అడుగులో కేంద్రం కూడా సహాయం చేసే అవకాశం ఉన్నందున(ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా అయినా) ముఖేశ్ అంబానీ తీసుకువచ్చే ఈ-వ్యాలెట్ పేటిఎంను మించిపోతుందని అంచనా. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో?

Related posts:
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
సింధూరంలో రాజకీయం
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
రాహుల్ పై కరుణ ఆగ్రహం

Comments

comments