బీసీసీఐ పగ్గాలు గంగూలీకి

May Saurav Ganguly get BCCI Chairman post

సుప్రీంకోర్టు తీర్పుతో భారత క్రికెట్ కు దిశానిర్దేశం చేసే బీసీసీఐ భవితవ్యంపై అందరికి అనుమానాలు కలిగాయి. అసలు బీసీసీఐని పటిష్టంగా నడిపించే సత్తా ఎవరికి ఉంది అని చర్చ కూడా అప్పుడే మొదలైంది. లోధా కమిటి సిఫార్సులను అమలు చెయ్యడంలో బీసీసీఐ చైర్మెన్ అనురాగ్ ఠాకూర్ చేస్తున్న నిర్లక్ష్యానికి సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. బీసీసీఐ అధ్య‌క్షుడిగా అనురాగ్ ఠాకూర్ కొన‌సాగ‌రాద‌ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాంతో తర్వాత బీసీసీఐ అధ్య‌క్షుడు ఎవ‌ర‌నేదానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. బీసీసీఐ టాప్ బాస్ పోస్టుకు మాజీ టీమిండియా కెప్టెన్ బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ పేరును కూడా ప‌రిశీలించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే వెస్ట్‌జోన్ ఉపాధ్య‌క్షులు టీసీ మాథ్యూ, గౌత‌మ్ రాయ్‌లు పోస్టుకు అర్హులా కాదా అనే అంశంపై బోర్డు దృష్టి సారించింది. మ‌రోవైపు సౌత్ జోన్ ఉపాధ్య‌క్షుడు గంగ‌రాజు,సెంట్ర‌ల్ జోన్ ఉపాధ్య‌క్షుడు సీకే ఖ‌న్నా, నార్త్ జోన్ ఉపాధ్య‌క్షుడు ఎమ్ఎల్ నెహ్రూలు సుప్రీం కోర్టు ఆమోదించిన లోధా రిక‌మెండేష‌న్స్ ప్ర‌కారం అర్హులు కార‌ని బోర్డు తేల్చేసింది. బీసీసీఐలో కొంత గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ… భార‌త్ – ఇంగ్లండ్ జ‌ట్ల మధ్య ఈనెల 15 నుంచి జ‌ర‌గ‌నున్న వ‌న్డే మ్యాచ్‌ల‌కు ఎలాంటి ఆటంకం ఉండ‌ద‌ని బోర్డు వ‌ర్గాలు పేర్కొన్నాయి. సౌరవ్ గంగూలీ స్టార్ తిరిగి బీసీసీఐ చైర్మెన్ గా ఎన్నికైతే మాత్రం క్రికెట్ బిజినెస్ లో కొన్ని కీలక మార్పులు జరుగుతాయని చాలా మంది నమ్మకం.

Related posts:
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
తెలుగుదేశంలో ఆగష్టు భయం
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
అహా... అందుకేనా..?!
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
బాబుగారి చిరు ప్లాన్
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ఓటుకు నోటు కేసును మూసేశారా?
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments