ఎప్పటికీ అది శశి‘కలే’నా?

May shashikala's Chief Minister dream will not fullfill

తమిళనాడులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అక్కడి రాజకీయాల సమీకరణలు మారుతున్నాయి. అయితే జయలలిత స్థానంలో ఆమె స్నేహితురాలు శశికళ ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారు అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు తమిలనాడులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం సీన్ రివర్స్ అవుతోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

నాడు జయలలితతొ దగ్గరగా ఉన్న శేఖర్ రెడ్డి పెద్దనోట్ల వ్యవహారంలో అరెస్ట్ అవడం , ఇంకో వైపు తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు,మరోవైపు జయలలిత మేనకోడలు దీప హెచ్చరికలు, అన్నింటికీ మించి పన్నీర్ సెల్వం దూరం దూరంగా మెలగడం… జిల్లాలలో పార్టీ కార్యకర్తల్లో వ్యతిరేకత ఇవన్నీ కలసి శశికళను బెంబేలెత్తిస్తున్నాయి. అలాగే హఠాత్తుగా పోయస్‌ గార్డెన్ చుట్టూ ఉన్న పోలీసు భద్రతను తొలగించడం తో  శశికళ  మరింత కలవరానికి గురైనారని అంటున్నారు. వీటన్నిటి కంటే ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ ఏ మైండ్ గేమ్ ఆడాతారో అని మల్లగుల్లాలు పడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడులో అధికారం సాగాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం కచ్చితంగా ఉండాల్సిందే. అయితే మోదీ వేస్తున్న పాచికలో లేదంటే కాలం పెడుతున్న పరీక్షో కానీ శశికళకు అన్ని వ్యతిరేకంగానే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆమె సిఎం కుర్చీలో కూర్చోవాలని అనుకున్నా కానీ రాజకీయ గాలి మాత్రం శశికళకు వ్యతిరేకంగా వీస్తోంది. ఆర్కేనగర్ నుండి ఎన్నికల్లో నిలిచి, గెలిచి, పదవి ఎక్కుదామని అనుకున్న శశికళకు ఇప్పటికైతే అది కలగానే మిగలనుంది. అన్ని కలిసి వచ్చి మోదీ అనుగ్రహిస్తే కానీ శశికళ కల నెరవేరేలా కనిపించడంలేదు.

Related posts:
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
మా టీవీ లైసెన్స్ లు రద్దు
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
బాబు గారి అతి తెలివి
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
బాబుకు గడ్డి పెడదాం
500 నోటుపై ఫోటో మార్చాలంట
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ
నరేంద్రమోదీ@50 రోజులు

Comments

comments