ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?

May Telangana CM KCR Resign to his CM Post Palvai Govardhan Reddy told

ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపిలో కాస్త రాజకీయంగా పరిస్థితులు కొంత అటుఇటుగా ఉన్నా.. తెలంగాణలో మాత్రం అంతా ప్రశాంతంగా ఉంది. ఫుల్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను దాదాపుగా తుడిచిపెట్టారు. దాంతో పరిస్థితి కేవలం టిఆర్ఎస్, కేవలం కేసీఆర్ అనేలా ఏర్పడింది. అయితే తాజాగా ఓ ప్రకటన అందరికి ఆశ్చర్యం కలిగించింది. అది కూడా ఏదో చోటామోటా లీడర్ లేదంటే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వాళ్లు అన్నారు అంటే దానికి పెద్దగా మాట్లాడే అవసరం ఉండదు. కానీ ఆ ప్రకటన చేసింది సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్.

తెలంగాణలో ఎలాంటి రాజకీయ అనిశ్చితికి అవకాశం లేదు అనే అందరూ అనుకున్నారు. కళలో కూడా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి అనే ద్యాసరాలేదు. కానీ తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చేసిన ప్రకటన అందరిని ఆలోచనలో పడేసింది. ఇంతకీ ఎవరా సీనియర్ నేత అంటే.. పాల్వాయి గోవర్దన్ రెడ్డి. అవును ఆయన తన రాజకీయ అనుభవంతో అన్నారో లేదంటే చీకట్లో బాణం వేశారో తెలియదు కానీ తెలంగాణకు ఆరు నెలల్లో కొత్త సిఎం వస్తారు అని జోస్యం చెప్పారు. పాల్వాయి గోవర్థన్ రెడ్డి గత దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ సీనియర్ నాయకుడికి పార్టీలో ఎంత ప్రయార్టీ ఉందో తెలియదు కానీ బయట మాత్రం ఆయన మాటలకు ఆలోచించే వాళ్లు  మాత్రం చాలా మంది ఉన్నారు.

తెలంగాణలో కారు దెబ్బకు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయింది. అలాంటి దీనావస్థలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పాల్వాయి గోవర్థన్ చేసిన వ్యాఖ్యలను కొంత మంది లైట్ తీసుకున్నా కొంత మంది మాత్రం ఆలోచిస్తున్నారు. తాజాగా పాల్వాయి తెలంగాన‌కు 6 నెల‌ల్లో కొత్త సీఎం వ‌స్తున్నాడంటూ చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చారు. ఆయ‌న చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న ప‌ద‌వికి మరో ఆరు నెలల్లో రాజీనామా చేసి కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించనున్నారని వ్యాఖ్యానించారు. అయితే దీనిలో మరో గమనించాల్సిన విషయం ఏంటంటే.. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ను సిఎం చెయ్యాలనే ఉద్దేశంతో రాజీనామా చేయవచ్చు లేదా పర్సనల్ కారణాల వల్ల కూడా కేసీఆర్ సిఎం పదవి నుండి తప్పుకొని.. కేటీఆర్ ను సిఎం కుర్చీలో కూర్చోబెట్టవచ్చు.

Related posts:
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
తాగుబోతుల తెలంగాణ!
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
వీళ్లకు ఏమైంది..?
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
జగన్ సభలో బాబు సినిమా
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
బాకీలను రద్దు చేసిన SBI

Comments

comments