బతుకు బస్టాండ్ అంటే ఇదే

May TSRTC introduce platform ticket in busstands

ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే చెప్పే మాట  బతుకు బస్టాండైంది అని కానీ ఇప్పుడు ఆ బస్టాండ్ కు వెళ్లాలంటే ప్లాట్ ఫాం టికెట్ తీసుకోవాల్సి వస్తుందేమో. విభజన తర్వాత తెలంగాణ ఆర్టిసీని కష్టాలు, నష్టాల నుండి బయట వేసేందుకు కేసీఆర్ సర్కార్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. కాగా తాజాగా వినిపిస్తున్న ఓ ప్రతిపాదన మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంతకీ ఆ అంశం ఏమిటో చాలా మందికి అర్థమై ఉంటుంది. అదే రైల్వే స్టేషన్ లో మాదిరిగా బస్టాండ్ లో కూడా ప్లాట్ ఫాం టికెట్ తీసుకురావడం.

రైల్వేశాఖ చిరకాలంగా ప్లాట్ ఫారం టికెట్స్ అమ్మకాల ద్వారా ఏటా కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది. అదే విధంగా రాష్ట్రంలోని ఆర్టీసీ బస్టాండ్లలో కూడా ప్లాట్ ఫారం టికెట్స్ ప్రవేశపెట్టి తమ ఆదాయాన్ని పెంచుకోవాలని అధికారులు ఆలోచిస్తున్నారని తాజా సమాచారం. నష్టాలలో ఉన్న ఆర్టీసిని గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదివరకే అనేక మంచి సూచనలు చేశారు. వాటిలో ఈ సూచనలేదు. ఇది ఆర్టీసీ అధికారులకి కలిగిన ఆలోచన. రాష్ట్రంలో రోజూ లక్షలాది మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తుంటారు. వారిని బస్సులలో ఎక్కించేందుకు లేదా రిసీవ్ చేసుకోనేందుకు అనేక వేలమంది వస్తుంటారు. కనుక ఆర్టీసీ బస్టాండ్లలో కూడా ప్లాట్ ఫారం టికెట్స్ ప్రవేశపెట్టిన్నట్లయితే భారీగా ఆదాయం సమకూర్చుకొని తమ నష్టాలని కొంతమేర తగ్గించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ముందుగా హైదరాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలలో ఉన్న ప్రధాన బస్టాండ్లలో ఈ ప్లాట్ ఫారం టికెట్ విధానం అమలుచేసి చూడాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో బస్టాండ్లని రెండు లేదా మూడు కేటగిరీలుగా విభజించి ప్లాట్ ఫారం టికెట్ ధరలు నిర్ణయించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ప్లాట్ ఫారం టికెట్ ధర 5రూపాయలుగా నిర్ణయించాలని భావిస్తున్నాట్లు సమాచారం. దీని అమలులో సాధకబాధకాల గురించి అధికారులు అధ్యయనం చేస్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ ప్లాట్ ఫారం టికెట్ విధానం అమలుచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related posts:
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
వీళ్లకు ఏమైంది..?
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
ఆట ఆడలేమా..?
ఈ SAM ఏంటి గురూ..?
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
బాబు బిత్తరపోవాల్సిందే..
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
చంద్రబాబు చిన్న చూపు
నారా వారి నరకాసుర పాలన
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
తెలంగాణ 3300 కోట్లు పాయె
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
మోదీ ఒక్కడే తెలివైనోడా?
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?

Comments

comments