ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం

May Uttam Kumar Reddy loose his PCC Chief post soon

తెలంగాణలో ఉన్నా లేనట్లు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం సాకారం చేసింది కాంగ్రెస్ కూటమి యుపిఎనే. నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ కు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆలోచించిన, చెప్పిన నాయకులు కనుచూపు మేరలో లేరు. కేసీఆర్ పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖాళీ అయిపోయింది. ఉన్న ముగ్గురు, నలుగురు నాయకుల మధ్య ఆదిపత్య పోరుసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి అంతోకొంతో పట్టు ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా. అలాంటి ఖమ్మం జిల్లా నాయకుల మధ్యసాగుతున్న వార్.. చివరకు పిసిసి చీఫ్ పదవికి గండం తెస్తోంది అని రాజకీయ సర్కిల్స్ లో వార్త.

తెలంగాణ పిసిసి చీఫ్ గా గతంలో ఉన్న పొన్నాల లక్ష్మయ్య ప్లేస్ లో ఉత్తమ్ కుమార్ ను తీసుకువచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. నిజానికి కాంగ్రెస్ కు మాత్రమే తెలంగాణలో టిఆర్ఎస్ తర్వాత కాసింత ఓటు బ్యాంకు ఉంది. కానీ నాయకత్వలోపం వల్ల పార్టీలో విభేదాల కారణంగా తెలంగాణవ్యాప్తంగా పార్టీ మనుగడకు అవకాశం లేకుండాపోయింది. కాగా తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి చీఫ్ పదవి నుండి తప్పించాలని నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నాయకుడు అధిష్టానం మీద తీవ్ర వత్తిడి తీసుకువస్తున్నారట. అందుకు అధిష్టానానికి ఆ నాయకుడు భారీగానే ఆఫర్ కూడా చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానని, పీసీసీ పదవి ఇవ్వాలని కోరుతున్న న‌ల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ-ప్రస్తుత ఎమ్మెల్సీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి హోదాలో ఉన్న దిగ్విజయ్ సింగ్‌తో ఉత్తమ్ కుమార్ కు మనస్పర్థలు రావడం వల్ల ఆయన డిగ్గీ సంబంధికులను కలిసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండున్నరేళ్లు అయినా పార్టీ బలోపేతం కాలేదని అధిష్టానంతోపాటు మాజీ ఎంపీలు కూడా ఉత్తమ్‌పై అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాకుండా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేటేస్తే రానున్న ఉప ఎన్నికలకు నాయకత్వం సిద్ధంగా ఉందా? అంటే నాయకుల నుంచి బిక్క‌మొహం వేయ‌డం త‌ప్ప మ‌రేమీ లేదు. ఒకవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరుతున్న కాంగ్రెస్‌…ఉపఎన్నికలను ఎదుర్కొనేందుకు దిక్కులు చూస్తున్నది. దీంతో ఉన్నపళంగా పిసిసి చీఫ్ ను మార్చాలని నల్లగొండకు చెందిన సదరు నేత వత్తిడి చేస్తున్నారట. అయినా వెంటలేటర్ మీదున్న కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం కోసం పాకులాట ఎందుకో అని చలోక్తులు పేలుస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

Related posts:
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
నయిం కేసులో పెద్ద తలకాయలు
బాబు ఏమన్నా గాంధీనా?
నజీబ్ జంగ్ రాజీనామా
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు

Comments

comments