మోదీ వేసిన ఉచ్చులో మాయావతి

Mayawathi in Modi's trap

పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత మోదీ సర్కార్ చాలా చాకచక్యంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. యుపిలో జరుగుతున్న ఎన్నికలకు గాను అన్ని రకాలుగా సిద్ధమైన బిజెపి పార్టీ తాజాగా బిజెపికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే బీఎస్పీ అధినేత మాయావతిని మోదీ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. తాజాగా ఆమె పార్టీ ఖాతాలో కోట్ల రూపాయలు జమా అవడం ఆమెను, పార్టీని ఇబ్బందుల్లోపడేసింది. బీఎస్పీ పార్టీ ఖాతాలో వందల కోట్లు నగదు జమ అయినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు.  పెద్ద నోట్లు రద్దయిన తర్వాత నవంబర్ 8వ తేదీ తర్వాతనే బీఎస్పీ ఖాతాలో 104 కోట్లు జమ అయినట్లు ఆ శాఖ గుర్తించింది.

మాయావతి సోదరుడి ఖాతాలో కూడా పెద్ద యెత్తున నగదు జమ అయిందని తేలడంతో మాయ ఇబ్బందుల్లో పడ్డారు. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరగనుండటంతో మాయకు ఈ సంఘటన ఎదురుదెబ్బేనని పరిశీలకులు చెబుతున్నారు. అయితే మాయావతి మాత్రం కమలనాధులపై కన్నెర్ర చేశారు. కావాలనే బీజేపీ నేతలు తమపై కక్ష కట్టి ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫండ్ కింద జమ అయిన నగదుకు కూడా లెక్కలు చెప్పమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తాను దళిత నేతను అయినందునే ఈ దాడులు చేయిస్తున్నారని మాయ దళిత కార్డును కూడా వాడేశారు. బీఎస్పీ విరాళాల కోసమే ఈ నగదును సేకరించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడక ముందే తాము విరాళాల సేకరణ జరపినట్లు మాయావతి స్పష్టం చేశారు. కావాలనే బీజేపీ ఈ రాద్ధాంతం చేస్తుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ వివాదంలో నుంచి బయటపపడటం మాయకు కొంచెం కష్టమే. మొత్తానికి మోదీ చేసిన ట్రాప్ లో మాయావతి దాదాపుగా ఇరుక్కున్నట్లే కనిపిస్తోంది.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
మా టీవీ లైసెన్స్ లు రద్దు
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
వాళ్లను వదిలేదిలేదు
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
జగన్ సభలో బాబు సినిమా
మోదీ ప్రాణానికి ముప్పు
BSNL లాభం ఎంతో తెలుసా?
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
కేసీఆర్ మార్క్ ఏంటో?
మోదీ మీద మర్డర్ కేసు!
ఛాయ్‌వాలా@400కోట్లు

Comments

comments