మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్

మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్

తెలుగు సినిమా రంగంలో మెగా ఫ్యామిలీ అంటేనే ప్రత్యేక గుర్తింపు. చిరంజీవి ఓ మొక్కగా తెలుగు సినిమాల్లోకి ప్రవేశించి తర్వాత మమా వృక్షంగా ఎదిగారు. ఇప్పుడు మెగా ఫ్యామలీ అంటే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది అంటే అది ఖచ్చితంగా చిరంజీవి వల్లే. కాగా మెగా ఫ్యామిలీలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చిరు ‘త్రయం’ గురించే. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లు తెలుగు తెర ద్వారా కోట్లాది మందికి పరిచయమైన స్టార్లు. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ గా పాగా వేసేందుకు మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్ గురించి తెలుగోడ అందిస్తున్న ప్రత్యేక విశ్లేషణ.

చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఏపిలో కాస్తోకూస్తో చరిష్మాతో నెట్టుకురాగ నాయకుడు కమ్ స్టార్ హీరో ఎవరు అంటే ఖచ్చితంగా చిరంజీవి పేరు చెప్పుకోవల్సిందే. అలాంటి చిరంజీవి పొలిటికల్ గా కొన్నాళ్ల నుండి కాస్త వెనుకబడ్డారు. ఏపి రాజకీయాల్లో తాను కోరుకున్నంత, ఊహించనంత ప్రాధాన్యత లభించడం లేదు అన్నది దాదాపుగా తెలుస్తోంది. దాంతో పొలిటికల్ గా మరోసారి తన ముద్ర వెయ్యడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ముందు రైతుల కష్టాలతో ముడిపడిన ఓ సినిమాకు ఓకే చెప్పారు. జనాల్లో సినిమాలపరంగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చిరు.. మరోసారి అదే పంధాలో సినిమా ద్వారా పొలిటికల్ గా మైలేజ్ పొందేందుకు రెడీ అవుతున్నారు.

ఇలా సినిమా ద్వారా మరోసారి జనాలకు దగ్గరై… తర్వాత పొలిటికల్ గా ముందుకు సాగాలని కూడా ఆయన అనుకున్నారని సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కొత్తగా చిరంజీవికి ఇచ్చిన ప్రాధాన్యత, తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని చరిష్మా కలిగిన సినీ రాజకీయ నాయకుడిగా చిరుకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. అయితే తర్వాత కాలం మారి పరిస్థితులు చెడి చిరుకు ఏ ఒక్క అంశంలోనూ కలిసిరావడంలేదు. దాంతో కనీసం 2019 నాటికైనా తిరిగి తెలుగు రాష్ట్రాల్లో చిరు మానియాను సినిమాల పరంగానే కాకుండా పొలిటికల్ గా కూడా కొనసాగించేందుకు సిద్దమవుతున్నారు.

Also Read:  చిరుకు పవన్ అందుకే దూరం

Also Read:  టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?

Also Read:   చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం

Also Read:  జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే

ఇక చిరంజీవి రెండో తమ్ముడు నాగబాబు.. కూడా పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ముందు నుండి కొంత మంది బిజెపి నాయకులతో సంబందాలు నెరిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత మాత్రం అది నిజం కాదని అనిపించింది. కానీ ప్రస్తుతం మాత్రం జగన్ ను సపోర్ట్ చేసే సోషల్ మీడియా గ్రూపుల్లో నాగబాబు పేరుతో పోస్టులు కనిపిస్తున్నాయి. నాగబాబు వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఆ విధంగా 2019 నాటికి నాగబాబు కూడా వైసీపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

మెగా బ్రదర్స్ లో పవర్ స్టార్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత జనసేన పేరుతో ప్రత్యేకంగా పార్టీ పెట్టారు. ఇక గత ఎన్నికల్లో పవన్ తెలుగుదేశం, బిజెపి కూటమికి మద్దతు తెలపడం ద్వారా ఇటు తెలుగుదేశంతోనూ, అటు బిజెపితోనూ మంచి సంబందాలను ఏర్పరుచుకున్నారు. తాను స్వంతంగా జనసేనను ముందుకు తీసుకెళ్లలేని క్రమంలో తెలుగుదేశం లేదా బిజెపితో కలిసి ముందుకు వెళ్లవచ్చు. ఇలా పవన్ కూడా 2019లో తన పొలిటికల్ మైలేజ్ కోసం ముందే ప్లాన్ వేస్తున్నారు.

చిరంజీవి ఏపి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి కీలకంగా అనిపించకపోయినా రాబోయే భవిష్యత్తులో మాత్రం ఆయన కీలకంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాంటి టైంలో కాంగ్రెస్ అధిష్టానం పిలిచి మరీ సిఎం రేస్ లో నిలబడమని అడగవచ్చు లేదంటే చిరంజీవి స్వయంగా పరిస్థితులను బట్టి సిఎం పదవి కోసం డిమాండ్ చెయ్యవచ్చు. ఇక పవన్ విషయానికి వస్తే.. ఏపిలో ప్రజావ్యతిరేకత అంతకంతకు పెరుగుతోంది. ఏపిలో చంద్రబాబు తర్వాత జగన్ మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. అలాగే తెలంగాణలో కేసీఆర్ అవలంభిస్తున్న ధోరణి కారణంగా మిగులు బడ్జెట్ నుండి లోటు బడ్జెట్ కు మారింది.పైగా ఏకపక్ష ధోరణి కారణంగా.. ప్రతిపక్ష పార్టీలు గళ్లంతైన తరుణంలో పవన్ మరో ప్రత్యామ్నాయం కావచ్చు.

ఇక మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం అందరూ కూడా జనాల్లో మంచి గుర్తింపు ఉన్న హీరోలున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ, అల్లు అరవింద్, మొన్నీమధ్యన హీరోయిన్ గా మారిన నిహారిక ఇలా ఇంత మంది మెగా ఫ్యామిలీ దన్నుగా ఉన్నారు. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో జనసేన ప్రజల్లోకి పాజిటివ్ టాక్ తో దూసుకెళితే మాత్రం మెగా ఫ్యామిలీ మొత్తం జనసేనకు అనుకూలంగా ప్రచారం నిర్వహించవచ్చు. దాంతో ఓటు బ్యాంకు పై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అలాంటి టైంలో పవన్ స్వంతంగా కింగ్ కావచ్చు లేదంటే కనీసం తెలుగు రాష్ట్రాల్లో కింగ్ మేకర్ కావచ్చు. అలాంటి టైంలో అన్ని పార్టీలతో సంబందాలను నెరిపేలా మెగా ఫ్యామిలీ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో పార్టీతో సంబంధాలు ఉంచుకోవడం అనేదే మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్‌గా కనిపిస్తోంది.

Related posts:
లోకేష్ గ్యారేజ్.. పార్టీకి రిపేర్లు చెయ్యబడును
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
సింధూరంలో రాజకీయం
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
టాప్ గేర్ లో ముద్రగడ
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
వెనకడుగు
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?

Comments

comments