నయీం కేసులో మాజీ మంత్రి… రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్

Minister Behind Nayeem case

ఆయన మాజీ మంత్రిగా పని చేశారు. మంత్రి పదవిని హైదరాబాద్ కోటాలో దక్కించుకున్న సదరు మంత్రి మీద చాలా ఆరోపణలున్నాయి. తాజాగా తెలంగాణ పోలీసులు కాల్చిచంపిన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఆ మంత్రిపై సిట్ విచారణకు సిద్దమవుతోంది. నయీంతో రోజూ మాట్లాడే ఆ మంత్రి అసలు స్వరూపం నయీం కాల్ డాటా తీస్తే తెలిసింది. దాంతో ఇప్పుడు ఆయనగారు ఇంటికి వెళితే ఎక్కడ పోలీసులు అరెస్టు చేస్తారేమోనని బిక్కుబిక్కుమంటూ రోడ్ల మీద కార్యక్రమాల పేరుతో తిరుగుతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే నయీం కేసులో స్పీడ్ పెంచిన సిట్ మరికొంత మందిని నయీంతో ఉన్న సంబందాలపై ఆరా తీస్తోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెగ రెచ్చిపోయిన ఆ మంత్రిగారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. తాజాగా నయీం కేసులో ఆయన పేరు వినిపించడంతో మరింత జాగ్రత్తగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో నయీం పేరుతో ఆ మాజీ మంత్రి ఏకంగా 30 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నగరంలోని పలు కార్యక్రమాల పేరుతో బిజీగా గడుపుతున్న ఆ మంత్రి గతంలో బడా వ్యాపారులు, నగల షాపులు, రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ ల వద్దకు నయీం మనుషులను పంపించి మరీ తన రౌడీయిజాన్ని చూపించేవాడట. అలాగే నయీం పేరుతో బలవంతంగా వసూళ్లకు కూడా ఆయన పాల్పడినట్లు సిట్ ప్రాధమికంగా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నయీంతో ఎవరెవరికి సంబందాలు ఉన్నాయి అన్న దానిపై ఆరా తీస్తున్న సిట్ అధికారులకు ఇప్పటికే చాలా కీలకమైన విషయాలు తెలిసినట్లు సమాచారం. నయీం కేసులో పట్టుబిగుస్తున్న సిట్ ఇప్పటికే 80 మందిని విచారించినట్లు తెలుస్తోంది.

Related posts:
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
తెలుగుదేశంలో ఆగష్టు భయం
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
ఏపిలో జగన్ Vs పవన్
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
బాబుగారి చిరు ప్లాన్
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
మన ఖాతాలే మోదీ టార్గెట్?
ఓటుకు నోటు కేసును మూసేశారా?
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments