మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా

Minister Ganta Srinivas Fire on Govt Officials

ఏపిలో మంత్రులు చేస్తున్న ఆకస్మిక తనిఖీలు అధికారులకు తలనొప్పిగా మారాయి. ఎప్పుడు ఏ మంత్రి తన పర్యటనను ఖరారు చేస్తారో తెలియదు. మరీ ముఖ్యంగా మంత్రి నారాయణ, మంత్రి గంటా శ్రీనివాస్ లు. నారాయణ అమరావతి పనుల్లో బిజీబిజీగా ఉన్నా కానీ వీలుదొరికితే చాలు తనిఖీలు చేస్తున్నారు. తాజాగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గంటా శ్రీనివాస్ నిర్వహించిన తనిఖీ అందరికి షాకిచ్చింది. అందునా మంత్రి అక్కడి పరిస్థితిని చూసి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం అధికారులను ఖంగారుపెట్టింది.

సింహాచలంలోని ఓ హాస్టల్ కు వెళ్లిన మంత్రి గంటా శ్రీనివాస్ అక్కడి పరిస్థితిని తనిఖీ చేశారు. హాస్టల్ లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల మీద తీవ్రంగా మండిపడ్డారు. దాదాపు రెండు గంటల పాటు గంట హాస్టల్లోనే ఉండి, అన్నింటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డార్మిటరీ, కిచెన్, తరగతి గదులు, డైనింగ్ హాల్.. ఇలా అన్నింటిని ఆయన పరిశీలించారు. విద్యార్థులకు మంచాలు కూడా సరిగా లేవని, ఫ్యాన్లు లేవని గుర్తించారు.

వంటకు ఉపయోగించే నీటి ట్యాంకుల పైన మూతలు లేకుండటాన్ని ఆయన గుర్తించారు. నీటిలో చెత్త, పురుగులు కనిపించాయి. దీంతో గంటా ఆవేశంతో ఊగిపోయారు. ‘మీ పిల్లలకు ఇటువంటి స్థితిలో వంట వండి తినిపిస్తావా? మీ లాంటి వాళ్లను ఉరితీయాలి’ అని విరుచుకుపడ్డారు. దాంతో అక్కడున్న అధికారులు భయంతో వణికిపోయారు. మంత్రిగారు మరీ ఇంతలా పట్టించుకుంటారని.. అనుకోకుండా అన్నీ చూస్తారని అనుకోలేదని అధికారులు ఒకరితో ఒకరు తమ బాధను వెల్లబుచ్చుకున్నారట. మొత్తానికి గంటా శ్రీనివాస్ హాస్టల్ తనిఖీలు అధికారుల గుండెల్లో మాత్రం గంట మోగించాయి.

Related posts:
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
నయీం బాధితుల ‘క్యూ’
స్థూపం కావాలి
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
ఏపీకి ఆ అర్హత లేదా?
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
శోభన్ బాబుతో జయ ఇలా..
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
మోదీ మీద మర్డర్ కేసు!

Comments

comments