జగన్ అన్న.. సొంత అన్న

MLA Roja called Jagan as Anna

నగరి ఎమ్మెల్యే రోజా తన అన్న వైయస్ జగన్ కు రాఖీ కట్టింది. రాఖీ పండగ పర్వదినాన తన కూతురుతో కలిసి రోజా వైయస్ జగన్ కు రాఖీ కట్టింది. వైయస్ జగన్ తనకు సొంత అన్న కన్నా ఎక్కువ అని రోజా వెల్లడించారు. వైయస్ జగన్ కుటుంబ సభ్యులతో తన అనుబంధాన్ని ఆమె మీడియాతో పంచుకున్నారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు వైయస్ జగన్ తన వెన్నంటి ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. తాను మొదటిసారి జగన్ ను ఎప్పుడు కలిసిందో కూడా ఆమె తెలిపారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు మొదటిసారి వైయస్ జగన్ ను కలిశానని రోజా చెప్పారు. ఆ సమయంలో నిజానికి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వెల్లడించేందుకు వెళ్లగా.. వారు ఎంతో ఆప్యాయంగా పలకరించారని అన్నారు. అప్పుడే వైఎస్ జగన్‌ను తాను ‘అన్న’ అని పిలిచానని, విజయమ్మను ‘అమ్మ’ అని పిలిచానని పేర్కొన్నారు. అప్పటి నుండి తాను అమ్మను(వైయస్ విజయమ్మ) కలిసేందుకు వెళుతుంటానని ఆమె వెల్లడించారు. తనను అసెంబ్లీ నుండి ఏడాదిపాటు సస్పెండ్ చేసేందుకు టిడిపి కుట్ర పన్నితే నాడు వైయస్ జగన్ తనకు అండగా నిలిచాడని ఆమె తెలిపారు. తన కోసం జగన్ ఎంతో చేశారని.. అందుకే జగన్‌ని తాను తన సొంత అన్న కన్నా ఎక్కువగా భావిస్తానని ఆమె వెల్లడించారు.

Related posts:
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
బావర్చి హోటల్ సీజ్
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
ప్యాకేజీ కాదు క్యాబేజీ
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
చంద్రబాబు చిన్న చూపు
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
గ్రామీణ బ్యాంకులను ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్
తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా అక్కినేని నాగార్జున అంశం
అందుకే భూకంపం రాలేదట
యాహూ... మీ ఇంటికే డబ్బులు
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు
శశికళ దోషి.. పదేళ్లు ఎన్నికలకు దూరం

Comments

comments