ప్యాకేజీ కాదు క్యాబేజీ

Roja-cabbage

ఏపికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ గురించి అధికారపార్టీ తెగ ఊదరగొడుతోంది. చంద్రబాబు నాయుడు ఏకంగా కేంద్రం ఇచ్చిన అద్భుత ప్యాకేజీకి గ్రామస్థాయిలో కూడా ప్రచారం కల్పించాలని తమ్ముళ్లకు పిలుపునిచ్చాడు. అయితే కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ మీద ఎమ్మెల్యే రోజా కొత్త భాష్యం చెప్పింది. కేంద్రం ఇచ్చిన దాన్ని ప్యాకేజీ అనేకంటే క్యాబేజీ అనవచ్చు అని అన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు జరుగుతుంటే, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యలు వెన్నుపోటు పొడుస్తున్నారని రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఏపీకి నాడు పదేళ్లు హోదా కావాలన్న వెంకయ్య, కాదు పదిహేనేళ్లు కావాలని డిమాండ్‌ చేసిన చంద్రబాబులే ఇప్పుడు హోదా రాకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఐదు కోట్ల ఆంధ్రుల హ‌క్కు అయిన హోదా కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను జైల్లో పెడుతుండడం బాధాకరమన్నారు. త‌న‌ను చూసి ప‌రిశ్ర‌మ‌లు ప‌రుగెత్తుకొని వ‌స్తాయ‌ని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు చిత్తూరు జిల్లాలో ప‌రిశ్ర‌మ‌లు వెన‌క్కి పోతుంటే ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో 6 వేల కోట్ల‌తో మ‌న్న‌వ‌రం ప్రాజెక్ట్ నెల‌కొల్పితే  దానికి అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయ‌లు క‌ల్పించ‌కుండా చంద్ర‌బాబు నిర్ల‌క్ష్యం చేయ‌డంతోనే ఆ ప‌రిశ్ర‌మ వేరే రాష్ట్రానికి త‌ర‌లివెళ్లింద‌న్నారు.

ఇక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అంతకంతకు పెరిగిందని.. చంద్రబాబు వల్లే ప్రతిష్టాత్మకమైన మన్నవరం ప్రాజెక్టు తరలిపోతోందన్నారు. హోదాకు బ‌దులు మ‌న‌కు ఏదో సాయం చేశామ‌ని కేంద్రం గొప్ప‌లు చెప్పుకుంటుంద‌ని, వాస్త‌వానికి ఏపీకి ముష్టి 3500 కోట్లు ఇచ్చారని, రెవెన్యూ లోటు 16 వేల కోట్లు ఉంటే కేంద్రం ఇచ్చింది కేవలం 3900 మాత్ర‌మే అని వివ‌రించారు. ఇంత దుర్మార్గంగా తెలుగు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప్ర‌జ‌లు బుద్ధి చెప్పే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని రోజా హెచ్చ‌రించారు. హోదా సాధించుకునేంత వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఆపే ప్రసక్తేలేదన్నారు.

Related posts:
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
స్టే ఎలా వచ్చిందంటే..
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
ఈ SAM ఏంటి గురూ..?
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
జియోకే షాకిచ్చే ఆఫర్లు
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ
అమ్మను పంపించేశారా?

Comments

comments