లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ

MLA Roja sensational comments on Nara Lokesh

ఏపిలో ప్రతిపక్ష పార్టీ మీద తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ చేసిన వ్యాఖ్యల మీద ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. మాట్లాడే నాలుగు మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేని చినబాబు మరోసారి అనవసరంగా వైసీపీ మీద చేసిన వ్యాఖ్యలు అదిరిపోయే రిప్లైఅందుకోవాల్సి వచ్చింది. అసలే తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పటికే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజాగా మరోసారి నారా లోకేష్ అభాసుపాలు కావాల్సి వచ్చింది. ఇంతకీ నారా లోకేష్ కు ఎలాంటి కౌంటర్ వచ్చిందో తెలుసా..?

ఏపి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి నారా లోకేష్ ను టార్గెట్ చేశారు. ఏపీలో ప్ర‌తిప‌క్షం లేద‌ని నారా లోకేష్ వ్యాఖ్యానించ‌డం కామెడీగా ఉంద‌ని వైకాపా మ‌హిళా నేత రోజా అన్నారు. లోకేష్ మాట‌లు వింటుంటే ఆయ‌న‌కు రాజ‌కీయాల‌లో ఎంత అనుభ‌వం ఉందో క్లియ‌ర్ గా తెలిసిపోతుంది.  లోకేష్ కామెడీ ఆర్టిస్టుకు ఎక్కువ‌. కామెడీ చేసే విల‌న్ కు త‌క్కువ అంటూ సెటైర్ వేశారు.

అలాగే వైకాపా ఎంపీలు రాజీనామాకు సిద్ద‌ప‌డుతుంటే అధికార పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా తెచ్చే ఉద్దేశం మీకు లేదా? అని టీడీపీ ఎంపీల‌ను సూటిగా ప్ర‌శ్నించారు. బాబుకు ద‌మ్ముంటే వాళ్ల ఎంపీల‌తో కూడా రాజీనామా చేయించాల‌ని అన్నారు. వైకాపా నుంచి కలుపుకున్న 20 మంది ఎమ్మెల్యేల‌ల‌తో రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకోవాలని గ‌ట్టి స‌వాల్ విసిరారు. మొత్తానికి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రోజా దిమ్మతిరిగే సమాధానమిచ్చారు.

Related posts:
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
బాబోయ్ బాబు వదల్లేదట
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
మా టీవీ లైసెన్స్ లు రద్దు
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
అమ్మకు ఏమైంది?
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
సౌదీలో యువరాజుకు ఉరి
బాబు గారి అతి తెలివి
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
ఆ సిఎంను చూడు బాబు...
బెంగళూరుకు భంగపాటే
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
ఆయన మాట్లాడితే భూకంపం
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

Comments

comments