రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం

Modi Barbed wire crown to RBI Governor Raghuram Rajan

దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మొదటి ఆయుధం కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ. అందుకే దేశంలో ప్రధాన మంత్రి ఎవరు అని అడిగిన తర్వాత వచ్చే తర్వాత ప్రశ్న.. ఆర్బీఐ గవర్నర్ ఎవరు.. అని. కానీ మన వాళ్లకు మాత్రం ఆర్థికవ్యవస్థ అంటే ఏమిటో కూడా తెలియదు కానీ విమర్శలు చెయ్యడంలో మాత్రం కొత్త డిగ్రీలు అందుకున్నారు. తాజాగా ఆర్బీఐ గవర్నర్ గా తన పదవీ బాధ్యతల నుండి తప్పుకుంటున్న రఘురాం రాజన్ గురించి దేశం మొత్తం చర్చిస్తోంది. అయినా రోడ్డు మీద ఏనుగులు వెలుతుంటే కుక్కలు అరవడం కామన్ అని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నెటిజన్లు రాజన్ కు సపోర్ట్ ఇస్తున్నారు.

సెప్టెంబర్ 4తో రాజన్ పదవీ కాలం ముగియనుంది. రఘురామ్ రాజన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. ఆర్ బీఐ గవర్నర్ గా ఆయనను తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ రాయడం అంద‌రికీ తెలిసిందే. భారతదేశ ఆర్థిక వ్యవస్థను నష్టాల బాట పట్టిస్తున్న రాజన్ వెంటనే తొలగించాలని స్వామి డిమాండ్ చేస్తున్నారు. ప్రధానికి రాసిన లేఖలో రాజన్ మానసికంగా పూర్తి భారతీయుడు కాదని స్వామి వ్యాఖ్యానించారు. అమెరికా ప్రభుత్వం రాజన్ కు జారీ చేసిన గ్రీన్ కార్డ్ ను పొడిగించడమే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే భారత ఆర్ధిక వ్యవస్థకు నష్టం కలిగించే చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. రాజన్ తీసుకున్న నిర్ణయాల మూలంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయని దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందంటూ మాట‌ల దాడి చేశారు.

కానీ ఇక్కడ మోదీ కానీ, ఆయన అనుచరగణం నుండి కానీ రాజన్ మీద సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యల మీద ఎలా స్పందన రాలేదు. అంటే సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం పరోక్షంగా సమర్థిస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా మోదీలాంటి వ్యక్తులు కూడా తమ రాజకీయాలను ఇలాంటి కోణంలో వాడుకుంటారు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. రఘురామ్ రాజన్ పై విమర్శలను అంతా తప్పుబట్టారు. ఇలా చేయడం వల్ల దేశంలోని స్వతంత్ర ప్రతిపత్తిగల వ్యవస్థలు తమ స్వాతంత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. రిజర్వుబ్యాంకు గవర్నర్ పదవిని ఒక వ్యక్తికి అప్పగించడమంటే ఈ దేశ ఆర్ధిక వ్యవస్థను ఆయన చేతుల్లో పెట్టడమే. రాజకీయ వ్యవస్థలో ఉండే వ్యక్తులు ఆర్ధిక బాధ్యతలు నిర్వర్తించే వారిని ఆక్షేపించడం సరికాదు.

ద్రవ్యోల్బణం అదుపు చేయడానికి రాజన్ ఎంతో మొండిగా వ్యవహరించారు. ర‌ఘురామ్ రాజ‌న్ కు అద్భుత‌మ‌యిన ఆఫ‌ర్లు ఇవ్వ‌డానికి అనేక సంస్థ‌లు రెడీ అయ్యాయి. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సంభవించనున్నట్లు 2005లోనే అభిప్రాయం వ్యక్తం చేయడం ద్వారా రఘురాం రాజన్ అందరి దృష్టిని ఆకర్షించారు. అలాంటి ముందుచూపున్న రఘురాం రాజన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితులు కాగానే ఎంతో మంది సంతోషించారు. దేశం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి ఆయన గట్టెక్కించగలరని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే అన్నిచర్యలు తీసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో బాధ్యతలు స్వీకరించిన రాజన్ కీలక మార్పులు తీసుకువచ్చారు. ఆయన చొరవతోనే ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ మారాయి. ఇప్పుడు స్వామి ఆశించిన‌ట్టుగానే ర‌ఘురాముడు అమెరికాకు త్వ‌ర‌లో వెళ్ళ‌బోతున్నారు.

రఘురాం రాజన్ చేసిన కీలక విజయాలు..

1. రూపాయికి నిలకడ: రూపాయి విలువ అంటేనే అందరూ భయంతో జడుసుకునే వాళ్లు. ఆగస్టు 2013నాటికి డాలర్ ముందు రూపాయి మారకం విలువ 68.80గా ఉండేది. అలాంటి రూపాయిని సెప్టెంబర్, డిసెంబర్ 2013 నాటికి 10శాతం వరకు బలపడేలా చేశారు.

2. ఫారెన్‌ఎక్చేంజ్ లను పెంచారు: భారతదేశం వద్ద ఫారెన్ కరెన్సీ నిలువలనను భారీగా పెంచి క్రెడిట్ రాజన్‌కు దక్కుతుంది. ఇప్పటిదాకా చేరుకోలేని గరిష్టానికి దాదాపుగా 363.23 మిలియన్ డాలర్ల ఫారెన్ కరెన్సీని పోగేశారు.

3. ఈజీ బ్యాంకింగ్: బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులకు రాజన్ నాంది పలికారు. అందులో భాగంగానే పేమెంట్లను సులభతరం చేశారు. అలాగే పేమెంట్ ను ఈజీగా చెల్లించే మార్గాలను కనుగొన్నారు. మొబైల్ బ్యాంకింగ్ లాంటి వాటికి మంచి బూస్టింగ్ ఇచ్చారు.

4. ద్రవ్యోల్బణం(ఇన్ఫ్లేషన్): రాజన్ చేసిన అన్ని విజయాల కన్నా ఇది గొప్పది. ఆయన తీసుకున్న చర్యల కారణంగానే ద్రవ్యోల్బణం 5శాతానికి మించలేదు.

మరింత ఇంతలా సేవ చేసిన రాజన్ కు తగిన గౌరవం ఇవ్వకుండా తమ పార్టీ ఎంపీ వ్యాఖ్యలు చెయ్యడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అన్నింటికి మించి దేశ ఆర్థిక వ్యవస్థను ఉరకలెత్తించకపోతే. ఎందుకు ఆయన పదవి కాలం ముగుస్తోంది అన్న వార్త విని చాలా మంది పారిశ్రామికవేత్తలు నిరుత్సాహ పడ్డారు. ఆర్థిక వేత్తలకు కూడా తెలియని లెక్కలు సుబ్రహ్మణ్య స్వామికి తెలుసా..? పైగా ఇంత అనుచితంగా ప్రవర్తించిన సుబ్రహ్మణ్య స్వామికి మంత్రి పదవి కూడా కట్టబెడుతారు అనే వార్త వినిపిస్తోంది. మొత్తానికి అంతా చేసిన రాజన్ కు మాత్రం ముళ్ల బాట వేసి వీడ్కోలు పలుకుతున్నట్లున్నారు.

     – Abhinavachary

Related posts:
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
జీఎస్టీ బిల్ కథ..
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
వెనకడుగు
మద్యల నీ గోలేంది..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
పైసలు వసూల్ కాలేదుగా..
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments