మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు

Modi facing ATM problems during currency ban in India

మోదీని పొగిడిన నోళ్లు ఇప్పుడు మూగబోయాయి. మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని నిన్నటి దాకా తెగ హడావిడి చేసిన నాయకులు ఇప్పుడు మీడియాకు కనిపించకుండా తిరుగుతున్నారు. అదేంటి మోదీని పొగిడిన వారికి ఏమైనా ఇబ్బందులున్నాయని అనుకుంటున్నారా..? వారికేం ఇబ్బందులు లేవు కానీ జనాలకు చిల్లర ఇబ్బందులే వారికి పాపంగా మారుతున్నాయి. నిన్నటి దాకా ఏటీఎంల ద్వారా ఎంత కావాలంటే అంత సొమ్మును డ్రా చేసుకున్న జనాలకు ఏటీఎంలు మరీ నిష్టూరంగామారాయి. బ్యాంకు అధికారులు వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. అసలు ఏటీఎంల పరిస్థితి ఎందుకు ఇలా తయారైందో తెలుసా?

దేశంలో ఉన్న మొత్తం ఏటీఎంల సంఖ్య  2, 02, 801… మోడీ దెబ్బకు అన్నీ ఒక్కసారిగా బిజీగా మారిపోయాయి. నగదు ఇలా పెడితే చాలు అలా జనం లైన్లు కట్టి తీసుకెళ్లిపోతున్నారు. మళ్లీ నింపడానికి చాలా టైం పడుతోంది. అంతేకాదు.. 500 – 1000 నోట్లు రద్దు చేసిన తరువాత 2000 నోట్లు సరిపడా అందుబాటులోకి తేవడమే ఇంకా పూర్తిగా సాధ్యం కాలేదు. దీంతో 100 నోట్లే పెద్ద నోట్లయ్యాయి. కానీ పెద్ద నోట్లైన రెండు వేల నోట్లను ఏటీఎంలలో అడ్జస్ట్ చేద్దామంటే కుదరడం లేదు. అయితే ఇక్కడ అసలు సమస్య వేరే ఉంది.

దేశంలో ఏటీఎంల మరమ్మతులు – అడ్జస్టుమెంట్లు చేసే సంస్థలు ప్రధానంగా మూడే ఉన్నాయి. అవి.. ఎన్ సీఆర్ – డీబోల్డ్ – ఏజీఎస్. ఈ మూడు సంస్థలకు గట్టిగా 2 వేల మంది ఇంజినీర్లు ఉన్నారు. అంటే ఒక్కొక్కరు 100 ఏటీఎంలు సరిచేయాలి. కొత్త నోట్లకు సరిపడేలా ఉన్న ఏటీఎంలను రెడీ చేయడానికి వాటి టెక్నాలజీ – అనుకోని అవాంతరాలను బట్టి కనీసం మూడు గంటల నుంచి 6 గంటల సమయం పడుతుంది. యావరేజిన 4.5 గంటల టైం తీసుకున్నా ఒక్కొక్కరు 450 గంటలు పనిచేయాలి. అంటే రోజుకు 15 గంటలు లెక్కేసినా 30 రోజుల టైం కావాలి.

2 వేల నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి గట్టిగా మూడు రోజులైంది. అప్పటి నుంచి లెక్కేసినా ఇంకా కనీసం 27 రోజుల టైం పడుతుంది. అంటే దేశంలోని అన్ని ఏటీఎంలు అడ్జస్టు చేయాలంటే డిసెంబరు 17 వరకు టైం పడుతుంది. ఇది ఫుల్ టైం పనిచేసిన సందర్భంలో. ఇంకా సెలవులు – ఇతర అవాంతరాలు లెక్కేస్తే మరో వారం రోజులు అదనంగా కలుపుకోవాలి.  అంటే…. డిసెంబరు 25 వరకు ఏటీఎంలు సరిచేయడానికే టైం సరిపోతుందన్నమాట. కానీ మోదీ తన నిర్ణయాన్ని ప్రకటించే ముందు ఏటీఎంల పరిస్థితి మీద ఒక్కసారి రివ్యూ చేసి ఉంటే ప్రజలు ఇంతలా ఇబ్బందులు ఎదుర్కునే వారు కాదు అన్నది వాస్తవం. అయితే మరో వారం రోజుల్లో అందరికి నగదును అందుబాటులోకి తీసుకువస్తామని మోదీ సర్కార్ అంటోంది. ఏటీఎంలు లేకుండా అది అంత ఈజీగా సాధ్యపడేపనైతే కాదు. మరి చూడాలి మోదీ ఈ ఏటీఎం సమస్యను ఎలా పరిష్కరిస్తారో?

Related posts:
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
లోకేష్ గ్యారేజ్.. పార్టీకి రిపేర్లు చెయ్యబడును
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
సింధూరంలో రాజకీయం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
ఇక యుద్ధమే కానీ..
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
మెరుపు దాడి... నిజమా-కాదా?
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
మోదీ భజన అందుకేనా?

Comments

comments