బినామీలు భయపడే మోదీ ప్లాన్

Modi fight aganist black money

దేశ ప్రధాని నరేంద్ర మోదీ  మరోసారి నల్లకుబేరులను హెచ్చరించారు. బినామీల భరతం పట్టడం ఖాయం అని మోదీ తేల్చేశారు. బినామీల చట్టాన్ని మరింత కఠినం చేస్తామని కూడా ఆయన అన్నారు. లెక్కల్లో చూపని అక్రమార్కుల డబ్బులను ఏ రూపంలో ఉన్నా కానీ ఉపేక్షించేదిలేదు అని మోదీ స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దు తర్వాత చాలా మంది నల్లకుబేరులు పేదలను మోసం చేస్తూ.. వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారని అన్నారు. జన్ ధన్ యోజన ఖాతాల్లో డబ్బు జమా అవుతున్న నేపథ్యంలో మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

70 ఏళ్లుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న జబ్బు ఇప్పుడు నయం కావడం కష్టమన్నారు. దానిని నయం చేసేందుకు చికిత్స అంత సాధరణంగా ఉండదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను నేను అర్థం చేసుకోగలనని అన్నారు. ఎన్ని కష్టాలు వస్తున్నా తమ నిర్ణయానికి మద్దతిచ్చిన దేశ ప్రజలను అభినందించారు మోడీ. అవినీతిపై జరుగుతున్న పోరాటానికి యువత సైనికులై ముందుండి నడపాలని పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీలు ఎలా సాగించాలో ప్రజలు తెలుసుకునేందుకు యువత వారికి సాయం చేయాలన్నారు. సెల్ ఫోన్ ద్వారా చెల్లింపులు.. వాట్సప్ మెసేజ్ ను ఫార్వర్డ్ చేయడం కన్నా సులభమన్నారు.

నల్లధనాన్ని బాగా పోగేసుకున్న వారు బినామీల పేరుతో ఆస్తులను లేదంటే నగదును ఉంచుకోవడం మనదేశంలో పరిపాటే. అయితే నల్లధనం మీద మోదీ చేస్తున్న పోరాటంలో భాగంగా బినామీలను కూడా ఓ పట్టుపట్టడానికి సిద్ధమవుతున్నారు మోదీ. అయితే బినామీల చట్టాన్ని ఎలా తీసుకురాబోతున్నారు? బినామీ చట్టంలో అంశాలు ఏంటి అనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కాగా నల్లధనం మీద తన పోరాటంలో బినామీలపై పోరాటం ఎంతో కీలకం అని మాత్రం మోదీ గట్టిగా నమ్ముతున్నారు. మరి చూడాలి మోదీ బినామీలను ఎంత వరకు అరికట్టి, నల్లధనం మీద విజయం సాధిస్తారో. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం కొన్నితప్పటడుగులు వేసిన నేపథ్యంలో బినామీ చట్టంపై అందరికి ఆసక్తిరేగుతోంది.

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
‘స్టే’ కావాలి..?
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
2018లో తెలుగుదేశం ఖాళీ!
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్
ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం

Comments

comments