మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?

Modi gave fifth rank to Ap Cm Chandrababu Naidu

నెంబర్ వన్ కు నేనే బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుకు అనుకోని షాక్ తగిలింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఉత్తమంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రులకు ర్యాంకులు ఇస్తున్నట్లు సమాచారం. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ప్రజాప్రతినిధులకు తన రిపోర్ట్ ఆధారంగా,పనితీరును బట్టి ర్యాంకులు వేశారు. మోదీ కూడా దాన్నే ఫాలోఅవుతూ ర్యాంకులను వెల్లడించనున్నారు. అయితే ఇక్కడే చంద్రబాబు నాయుడు గడ్డుపరిస్థితి ఎదురుకానుంది. మోదీ దగ్గర ఎంత బాగా ఉన్నా.. రాష్ట్రం కోసం ఎలా కష్టపడుతున్నా కానీ చివరకు ఆయనకు వచ్చి ర్యాంకు ఐదో ర్యాంక్ అట.

అవును.. పనితీరు ఆధారంగా ముఖ్యమంత్రులకు వేసిన ర్యాంకుల్లో చంద్రబాబు నాయుడు ఐదో ర్యాంకుతో వెనకబడిపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించిందట. పైగా చంద్రబాబు నాయుడుకు కూడా ఈ విషయం తెలిసి.. దగ్గరి వాళ్లతో బాధపడ్డట్లు తెలిసింది. కేంద్రం నుండి నిధులను ఎలాగూ ఇవ్వడంలేదు పైగా మీదనుండి పని తీరు బాగులేదన్నట్లు ర్యాంకు వేశారు మోదీగారు అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ నెల 16న దిల్లీలో జరిగే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. అక్కడ ముఖ్యమంత్రులకు ర్యాంకులను అలాట్ చేస్తారని ప్రచారం నడుస్తోంది.

ఫైబర్‌ గ్రిడ్‌ నుంచి, రాజధాని నిర్మాణానికి అవలంబించిన భూ సమీకరణ, సిఎం డాష్‌బోర్డు, ఇంటింటికీ ఇంటర్నెట్‌, బెస్ట్‌ ఇన్నోవేషన్స్‌, స్మార్ట్‌ వార్డు, స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమాలు, ఎల్‌ఇడి బల్బుల పంపిణీ అంశాల్లో తాను కొత్త పంథా తొక్కుతున్నట్లు ఆయన చెబుతుంటారు. తానే బెస్ట్‌ అని కూడా చంద్రబాబు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఐదో రాంకు ప్రచారంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా వీటిలో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చెయ్యాలనుకున్న కార్యక్రమాలు ఉండటంతో ఖచ్చితంగా మంచి పేరు వస్తుందని చంద్రబాబు ఊహించారట. కానీ మోదీ మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన లెక్కల ప్రకారం బాబుగారికి ఐదో ర్యాంకు ఇచ్చినట్లు తెలుస్తోంది. . ఈనెల 16న జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఉత్తమ విధానాలను స్వీకరించడమే కాకుండా ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాను కూడా ప్రకటించే అవకాశాలు ఉంటాయంటున్నారు. ఆలోగా జాబితాలో తన నంబర్‌ ఎగబాకుతుందన్న ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
ఇదో విడ్డూరం
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
గుజరాత్ సిఎం రాజీనామా
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
2018లో తెలుగుదేశం ఖాళీ!
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
దివీస్ పై జగన్ కన్నెర్ర
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
అమ్మను పంపించేశారా?

Comments

comments