మోదీ ప్రాణానికి ముప్పు

Modi got threat calls from unknown persons

ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేస్తామంటూ దిల్లీ పోలీసులకు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రస్తుతానికి దీన్ని ఇది ఆకతాయి పనిగానే పరిగణనిస్తున్నారు. ఇటీవల గోవాలో నిర్వహించిన ర్యాలీ ప్రధాని ప్రసంగిస్తూ తన ప్రాణాలకు ముప్పుందంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. బరౌరీలో నివాసం ఉండే దినేశ్ కుమార్ పేరుతో జారీ అయిన నెంబరు నుంచి శుక్రవారం రాత్రి 11.30 గంటలకు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. దిల్షాద్ కాలనీ నుంచి కాల్ వచ్చినట్లు ట్రేస్ చేసిన పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో సిమ్ తీసుకున్న దినేశ్ కుమార్ ను పట్టుకుని విచారించారు.

ప్రస్తుతం ఆ నెంబరును తన బంధువు వాడుతున్నట్లు దినేశ్ చెప్పడంతో అతడిని ప్రశ్నించారు. దిల్షాద్ కాలనీలో దుకాణం దగ్గర నిలబడి ఉన్నప్పుడు అటుగా వెళుతున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి తన దగ్గరకు వచ్చి అర్జంటుగా కాల్ చేసుకోవాలని నా ఫోన్ అడిగి తీసుకున్నాడని అతడు పోలీసులకు తెలిపాడు. దీన్ని ఆ దుకాణం యజమాని కూడా నిజమేనని ధ్రువీకరించాడు. తరచూ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్స్ చేసేవారిని గురించి ఆరా తీసిన ఫోన్ చేసిన వ్యక్తిని మాత్రం పోలీసులు గుర్తించలేకపోయారు. దీనిపై క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్ దర్యాప్తు నిర్వహిస్తున్నాయి.

Related posts:
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
పెట్రోల్ లీటర్‌కు 250
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
సింగ్ ఈజ్ కింగ్
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
సన్మానం చేయించుకున్న వెంకయ్య
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
అడవిలో కలకలం
నారా వారి నరకాసుర పాలన
అమెరికా ఏమంటోంది?
మోదీ హీరో కాదా?
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
జయ మరణం ముందే తెలుసా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి నేతల క్యు
చంద్రబాబు నల్లడబ్బు ఎక్కడ పెట్టాడంటే..
యాహూ... మీ ఇంటికే డబ్బులు
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
మంత్రి గంటా ఆస్తుల జప్తు

Comments

comments