మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ

Modi govt contraversial decision on Cash withdrawl

మోదీ పుణ్యమా దేశంలో అందరూ కరెన్సీ కొరతను ఎదుర్కొంటున్నారు. ఎవరు చూసినా కరెన్సీ లేక, ఏం చెయ్యాలో పాలుపోని సందిగ్దంలో ఉన్నారు. సరే నరేంద్ర మోదీ యాభై రోజుల టైం అడిగారు కదా.. అప్పటి దాకా వెయిట్ చేద్దాం అనుకుంటే.. అంతలోపే మోదీ సర్కార్ ఓ పెద్ద బాంబ్ పేల్చింది. బ్యాంకులో మ‌న డ‌బ్బులు మ‌నం దాచుకున్నాఛార్జీ చేస్తామంటున్నారు. మ‌న డ‌బ్బులు మ‌నం డ్రా చేసుక‌న్నా పెనాల్టీ క‌ట్టాలంటున్నారు. రోజురోజు ఆంక్ష‌లు క‌ఠినం చేస్తున్నారు. డిసెంబరు 30 తరువాత ఏటీఎంల నుంచి రోజుకు 2వేల‌500, బ్యాంకు నుంచి వారానికి 24వేల 000 తీసుకోవచ్చన్న నిబంధన ముగుస్తుంది.

బ్యాంకుల వద్ద తగినంతగా నగదు నిల్వలు లేక‌పోవ‌డంతో ఆంక్ష‌లు కొన‌సాగించాల‌ని బ్యాంకులు కోరుతున్నాయి. ఫిబ్రవరి చివరినాటికిగానీ రిజర్వు బ్యాంకు అవసరమైన నగదును పంపించలేదని అప్ప‌టిదాకా ప‌రిమితి ఉండాల్సిందేన‌ని అంటున్నారు. అంటే క‌రెన్సీ క‌ష్టాలు జ‌నాల‌కు ఇప్ప‌ట్లో తీరేలా క‌నిపించ‌డం లేదు.  దీనికి తోడు జ‌నాల‌పై మ‌రిన్ని ఆంక్ష‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నారు. మ‌న డ‌బ్బు మ‌నం డ్రా చేసుకోవ‌డానికి జ‌స్టిష్ షా సూచించిన విధంగా స‌ర్‌ఛార్జ్ వేస్తార‌ట‌. ఏటీఎం నుంచి 15వేలు మించి డ్రా చేస్తే 2శాతం దాకా పెనాల్టీ. బ్యాంకుల నుంచి 50వేలు డ్రా చేసినా ఛార్జీ చెల్లించాల్సిందే.

ఇక ఇంట్లో న‌గ‌దు పెట్టుకున్నా నేరంగానే చూస్తార‌ట‌. మూడుల‌క్ష‌ల‌కు మించి న‌గ‌దు రూపంలో చెల్లిస్తే ఆర్ధిక నేరం కేసులు పెడ‌తారు. ఇంట్లో 15ల‌క్ష‌లు న‌గ‌దు ఉంటే కూడా అదే ప‌రిస్థితి.   ఇదే కాదు.. త్వ‌ర‌లో రైతుల‌పై కూడా ఆదాయ‌ప‌న్ను పోటు వేస్తార‌ట‌. దీనికి సంబంధించిన ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న‌లు సిద్ద‌మ‌వుతున్నాయ‌ట‌. రైతుల‌కు రాయితీలు ఎత్తేస్తూ మ‌రోవైపు ప‌న్నుపోటు అంటే సంక్షోభంలో ప‌డడం ఖాయ‌మంటున్నారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు రోజురోజుకు మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని నిపుణులు అంటున్నారు. మొద‌ట్లో స‌మ‌ర్ధించిన చంద్ర‌బాబు వంటివాళ్లే యూ ట‌ర్న్ తీసుకోవ‌డం ఇందుకు అద్దం ప‌డుతుంది.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
బెంగళూరుకు భంగపాటే
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
అమ్మను పంపించేశారా?
దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ పేలుళ్ల బాధితులకు ఉరిశిక్ష
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments