ముందే కూయనున్న బడ్జెట్… మోదీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన

Modi govt decided to plan budget on February month

కేంద్ర బడ్జెట్ ను నెల రోజుల ముందుగానే ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది మోడీ సర్కారు. ఎక్కువ ప్రయోజనాలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందుకు అనుగుణంగా తమ ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించింది. ప్రతి నెల నిర్వహించే ప్రగతి కార్యక్రమం కింద బుధవారం ప్రధాని నరేంద్రమోడీ వివిధ రాష్ట్రాల  ఉన్నతాధికారులతో చర్చించారు. 92 ఏళ్ల ఆనవాయితీ ప్రకారం ఇంతవరకు ఫిబ్రవరి చివరి రోజు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. మే నెల మధ్యలో బడ్జెట్ పార్లమెంట్ ఆమోదం పొందుతుంది. అక్టోబర్ లో వాస్తవ వ్యయాలు ప్రారంభం అవుతాయి.

ఇప్పుడు అలా కాకుండా ఏప్రిల్ 1వ తేదీన ఆర్ధిక సంవత్సరం ప్రారంభించే నాటికి అన్ని కేటాయింపులు, పన్ను ప్రతిపాదనలను పార్లమెంట్ ఆమోదం లభించేలా ముందుగానే బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది కేంద్రం. 2017 ఫిబ్రవరి 1 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే విషయం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ప్రధాని మోడీ. బడ్జెట్ ను ఫిబ్రవరి నెలాఖరున కాకుండా నెల రోజుల ముందుగా ప్రవేశ పెట్టాలని సెప్టెంబర్ 21 జరిగిన సమావేశంలో మంత్రి వర్గం సూత్రప్రాయంగా అంగీకరించింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై గతంలోనే చర్చించింది కేబినెట్. ఐతే దీనికి ఎన్నికల సంఘం కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో ఫిబ్రవరి 1 నే బడ్జెట్ ప్రవేశపెట్టే చాన్సుంది. మార్చి 24 నాటికి మొత్త ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగా జనవరి 25కు ముందే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావాలని సూచించింది.

Related posts:
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
ఆట ఆడలేమా..?
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
యుపీలో ఘోర రైలు ప్రమాదం
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
తెలంగాణ 3300 కోట్లు పాయె
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
అవినీతి ఆరోపణల్లో రిజిజు
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
దేశభక్తి అంటే ఇదేనా?
బంగారం బట్టబయలు చేస్తారా?
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments