మోదీ చేసిందంతా తూచ్..

Modi govt failure in inplementation of Anil Bokil plan

దేశంలో నల్లధనాన్ని నివారించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇవ్వడానికి మోదీ తీసుకున్న డీమోనిటైజేషన్(పెద్దనోట్ల రద్దు) నిర్ణయంతో ఒక్కసారి కలకలం మొదలైంది. అయితే తాజాగా మోదీ ఈ డీమోనిటైజేషన్ ను అమలుపరచడంలో విఫలమవుతున్నారు అనే వార్త సంచలనం రేపుతోంది. విఫలమమవడం ఏంటి అనుకుంటున్నారా? అవును మోదీ అర్థక్రాంతి అనే పథకంలో భాగంగా అందులో ఉన్న ఐదు అంశాల్లో భాగంగా పెద్ద నోట్ల రద్దు కూడా ఒకటి. అయితే.. మోదీకి ఎవరైతే ఈ ఐడియా ఇచ్చారో ఇప్పుడు ఆయనే విమర్శలకు దిగడం విశేషం.

అనిల్ బోకిల్ అనే వ్యక్తి ఆలోచనల్లోంచి వచ్చింది అర్థక్రాంతి. దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి, నల్లధనాన్ని నిరోధించడానికి అర్థక్రాంతిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. అయితే అనిల్ బోకిల్ అర్థక్రాంతి సూచనల్లో కొన్నింటిని తీసుకున్నారని, అన్నింటిని అమలుచేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అనిల్ బోకిల్ నరేంద్రమోదీని కలిసి వివరించనున్నారని తెలుస్తోంది.

అనిల్ బోకిల్ పెద్ద నోట్ల రద్దుపై తాను ఐదు సలహాలు ఇవ్వగా, ప్రభుత్వం రెండు సలహాలను మాత్రమే పాటించిందని చెప్పారు. దీంతో పెద్దనోట్ల రద్దు పథకాన్ని స్వాగతించాలా? తిరస్కరించాలా? అన్నది తెలియని పరిస్థితిలా ఉందని చెప్పారు. తమ సంస్థ కేంద్రానికి అందజేసిన ‘రోడ్‌మ్యాప్‌’ను అనుసరించి ఉంటే.. పెద్దనోట్ల రద్దుపై ఇంత గందరగోళం చెలరేగేది కాదని అన్నారు. మొత్తానికి గతంలో మోదీకి నోట్ల బ్యాన్ మీద సలహాలిచ్చిన అనిల్ బోకిల్ ఇప్పుడు తిరగబడటం మీద జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాలంటే అనిల్ బోకిల్, మోదీ మీటింగ్ వరకు ఆగాల్సిందే.

Related posts:
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
కృష్ణా పుష్కర భక్తులకు హెచ్చరిక: కృష్ణా జలాల్లో బ్యాక్టీరియా
వాళ్లను వదిలేదిలేదు
యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
వంద, యాభై నోట్లు ఉంటాయా?
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
భారీగా రిక్రూట్‌మెంట్ తగ్గించిన ఇన్ఫోసిస్

Comments

comments