అందుకే భూకంపం రాలేదట

Modi jokes on Rahul gandhi about earthquakes statements

భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన మాటల చాతుర్యాన్ని ప్రదర్శించారు. వారణాసిలో నిర్వహించిన ఓ మీటింగ్ లో ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద పరోక్షంగా విమర్శల వర్షం కురిపించారు. మోదీ మాట్లాడిన తీరు అక్కడున్న వారికి నవ్వుతెప్పించింది. తాను మాట్లాడితే భూకంపం వస్తుంది అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు.. మోదీ కౌంటర్ ఇచ్చారు. వ్యంగ్యంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. ‘దేశంలో ఓ యువ‌నేత ఉన్నాడు, ఆయ‌న ఇప్పుడిప్పుడే మాట్లాడ‌డం నేర్చుకుంటున్నాడు. నేను మాట్లాడితే భూకంపం వ‌స్తుంద‌ని ఆయన అన్నాడు.  చివ‌రికి మాట్లాడాడు, అయితే భూకంపం రాలేదు. అతడు మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ప్ర‌ధాని మోదీ వ్యంగ్యంగా మాట్లాడారు.

వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. అవినీతి పరులకు మద్దతుగా విపక్షాలు తమపై విమ‌ర్శ‌లు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కొంద‌రు అవినీతి ప‌రుల‌కు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. దేశంలో స‌గం మంది పేద‌లు ఉన్నందున న‌గ‌దుర‌హిత లావాదేవీలు సాధ్యం కాద‌ని మ‌న్మోహ‌న్ సింగ్ అన్నారని, భార‌త్‌ లో 50 శాతం మంది పేద‌లు ఉండ‌డానికి కాంగ్రెసే కార‌ణమ‌ని మోదీ వ్యాఖ్యానించారు. తాము చేస్తున్న కార్య‌క్ర‌మాలతో దేశం స్వ‌చ్ఛ‌మైన బంగారంలా మారుతుందని ప్రధాని ధీమా వ్య‌క్తం చేశారు.

Related posts:
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
ఏపీ బంద్.. హోదా కోసం
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
పిహెచ్‌డి పై అబద్ధాలు
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
500 నోటుపై ఫోటో మార్చాలంట
షాకింగ్: వాహనం రిజిస్ట్రేషన్ కావాలంటే అది ఉండాలి

Comments

comments