చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా

Modi Order to Enquire on Chandrababu Naidu After Babus China Tour

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుకి ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న స్నేహం గురించి అందరికి తెలుసు. పొలిటికల్ మైలేజ్ కోసమే అయినా కూడా ఇద్దరి మధ్యన మంచి అనుబందం ఉంది అని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయస్థాయిలో కూడా తెలుసు. నరేంద్ర మోదీని బిజెపి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాతి నుండి మోదీతో చంద్రబాబు బాగా క్లోజ్ గా మెలిగారు. ఎన్నికల్లో అయితే చంద్రబాబు ఏం చెబితే అదే మోదీ వింటారు అన్నంత బిల్డప్ సాగింది. కేంద్రంలో మోదీ భారీ మెజారిటితో విజయాన్ని సాధించారు. ఆ తర్వాత పరిస్థితులు ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించాయి. మోదీ దగ్గరికి చంద్రబాబు నాయుడు వెళ్లి సహాయం కొసం పలుసార్లు కలవడంతో కాస్త చులకనయ్యారు.

పైగా ఓటుకు నోటు కేసులో కూడా కేంద్రం దగ్గరికి చంద్రబాబు నాయుడు వెళ్లడం, మోదీతో సహా చాలా మంది కేంద్ర మంత్రులను కలవడం కూడా ఓ రకంగా చంద్రబాబు నాయుడు ఇమేజ్ కు మోదీ ముందు తగ్గించిందని అనుకోవాలి. అయితే తాజాగా మరో వివాదం మోదీకి చంద్రబాబు నాయుడుకు ఉన్న దూరాన్ని మరింత పెంచిందని.. ఏకంగా చంద్రబాబు మీద కేంద్ర నిఘాకు మోదీ ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. అదేంటి అనుకుంటున్నారా..? ఇంతకీ ఈ ఇద్దరి మధ్యన ఇలాంటి పరిస్థితులకు కారణం ఎవరో తెలుసా..? చైనా దేశం అవును చైనా దేశమే.

ఆంధ్రప్రదేశ్ సి.ఎం చంద్రబాబునాయుడు రెండోసారి చైనా పర్యటనకు వెళ్లొచ్చారు. కానీ అక్కడ ఐదురోజుల పాటు బాబు ఏం చేశారు. ఎవరిని కలిశారు. ఎలాంటి హామీలు లభించాయి. అమరావతికి పెట్టుబడులు వచ్చాయా వాస్తవ పరిస్థితి ఏంటనే వైనం పై నిఘా వర్గాలు సమాచారం సేకరించి ప్రధాని మోదీ టేబుల్ ముందు పెట్టాయట. 38 దేశాలు మద్దతు పలికినా న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ (ఎన్ఎస్ జీ)లో సభ్యత్వం ఇవ్వకుండా చైనా భారత్ ను అడ్డుకుంది. అలాంటి దేశానికి వెళ్లడమే కాదు..చైనాకు అనుకూలంగా మాట్లాడటాన్ని ప్రధాని కార్యాలయం సీరియస్ గా తీసుకుందట. అందుకే అసలు చంద్రబాబు అక్కడకు ఎప్పుడు వెళ్లాడు ఏం చేశాడని ఆరా తీసిందట.

అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వని కేంద్రం మరోవైపు చైనా నుంచి వచ్చే పెట్టుబడులను అడ్డుకుంటుందా అనే అనుమానం కలుగుతుంది. కొన్ని కంపెనీలతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకున్నాడనే ప్రచారం జరుగుతుంది. అమెరికాకు దగ్గరవుతున్న భారత్..మరోవైపు చైనాకు దూరంగా జరుగుతుంది. ఇలాంటి సమయంలో చైనా దేశానికి వెళ్లడమే కాదు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని చంద్రబాబు కోరడం పైనా దృష్టి సారించింది ప్రధాని కార్యాలయం. మన దౌత్య విధానాలకు విరుద్దంగా చంద్రబాబు ఏమైనా వ్యవహరించారా లేక ఏపీ ప్రత్యేక దేశంగా భావిస్తున్నారా అనే వాదన చేస్తున్నారు కొందరు కమలం పెద్దలు. మరోవైపు చంద్రబాబు తీరును కేంద్ర ప్రభుత్వ పెద్దలు తప్పు పట్టారట. ఇదే పరిస్థితి ఇక ముందు కొనసాగితే కేంద్రానికి చిక్కులు రావడం ఖాయమని చెప్పారట. ప్రధాని మోదీ ఈ విషయం పై ఎలా స్పందిస్తారో మరి. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజి, విశాఖకు రైల్వే జోన్, పోలవరంకు నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఏం చేస్తుందో నన్న ఉత్కంఠ నెలకుంది.

Related posts:
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
అహా... అందుకేనా..?!
ఏపిలో జగన్ Vs పవన్
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
బాబుగారి చిరు ప్లాన్
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
మన ఖాతాలే మోదీ టార్గెట్?
ఏపి సిఎంగా నారా లోకేష్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments