రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?

Modi plans to give Big Gift to Yoga Guru Ram Dev Baba on International Yoga Day

యోగా గురుగా ఎంతో పేరు తెచ్చుకున్న బాబా రాందేవ్ ఇప్పుడు మన దేశంలో భారీ వ్యాపారవేత్తగా మారారు. పతంజలి ట్రస్టు ద్వారా ఇప్పటికే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన బాబా రాందేవ్ ఎన్నో విదేశీ కంపెనీలకు దడ పుట్టించారు. కోల్గేట్ లాంటి పెద్ద కంపెనీలకు కూడా ధీటుగా పోటీలో నిల్చి వారికి ముచ్చెమటలు పట్టించారు. బాబాగారి యోగా గురించి పక్కన బెడితే సంవత్సరంలో దాదాపుగా పది వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు పతంజలి ట్రస్టు ద్వారా జరుగుతున్నట్లు సమాచారం. మరి అలాంటి వ్యాపారవేత్తను వ్యాపారవేత్త అనే మార్క్ కన్నా కూడా యోగాగురుగా ఆయనకు బాగా గుర్తింపు ఉంది.

రాందేవ్ బాబా ఇప్పుడు ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేయగలిగే వ్యక్తిలా మారారు. అందుకే గతంలో నల్లధనం మీద అన్నా హజారేతో కలిసి పోరాడేందుకుు చేతులు కలిపారు. ఇక రాందేవ్ ముందు నుండి కూడా బిజెపి పార్టీకి అండగా ఉన్నారు. మరి ఇప్పుడు బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ప్రభుత్వం కూడా స్వామి భక్తిని నిరూపించుకోవాలి కదా.. అందుకే తాజాగా మోదీ సర్కార్ యోగా దినోత్సవం సందర్భంగా ఓ నజరానాను ఇవ్వడానికి నిర్ణయించినట్లు సమాచారం. ఇంతకీ ఏంటా నజరానా అనుకుంటున్నారా..?

యోగా గురు బాబా రాందేవ్ భారీ గిఫ్ట్ ను మోదీ సర్కార్ నుంచి అందుకోనున్నారు. ఫరీదాబాద్ సమీపంలోని ఆరావళి పర్వతాల సానువుల్లో ఉన్న కోట్ గ్రామ సమీపంలో యోగా కేంద్రాన్ని ప్రారంభించేందుకు భారీ సహాయాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా దాదాపుగా 1000 ఎకరాల భూమిని రాందేవ్ బాబాకు గిఫ్ట్ గా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్లు 2012లో సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఆగిపోగా, చట్ట సవరణ ద్వారా రాందేవ్ కు భూమి ఇవ్వాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మోదీ సర్కార్ ఇదే చేస్తే మాత్రం కాంగ్రెస్ తో పాటు, మిగిలిన ప్రతిపక్ష పార్టీలు దీని మీద రాద్దాంతం చెయ్యడం ఖాయం.

Related posts:
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
ఏపిలో జగన్ Vs పవన్
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
బాబుగారి చిరు ప్లాన్
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
మన ఖాతాలే మోదీ టార్గెట్?
ఓటుకు నోటు కేసును మూసేశారా?
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు!

Comments

comments