వంద విలువ తెలిసొచ్చిందట!

Modi said about hundred rupees value

పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత మోదీ పార్లమెంట్ లో పెద్దగా మాట్లాడటం లేదు. ప్రతిపక్షాలు ఎంతలా ప్రధాని నరేంద్ర మోదీ డీమానిటైజేషన్ మీద సమాధానం చెప్పాలని డిమాండ్ చేసినా కానీ మోదీ మాత్రం మౌనదీక్షలో ఉన్నారు. అయితే తాజాగా పరివర్తన్ ర్యాలీలో ఆయన విపక్షాల మీద విరుచుకుపడ్డారు. పార్లమెంటులో చర్చ జరక్కుండా విపక్షాలు పారిపోయాయని విమర్శించారు మోడీ.  తాము నల్లధనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే..  ప్రతిపక్షాలు పార్లమెంటులో చర్చ జరగకుండా అడ్డుకున్నదని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌ లో బీజేపీ పరివర్తన్‌  ర్యాలీలో పాల్గొన్న ప్రధాని..  కొన్ని పార్టీలు నల్లకుబేరులకు మద్దతిస్తున్నాయని ఆరోపించారు.

వెయ్యి రూపాయల నోటు ఉన్నప్పుడు 500, 100 రూపాయల నోట్లను ఎవరూ పట్టించుకోలేదని, పెద్ద నోట్ల రద్దు తర్వాత వంద రూపాయల విలువ, పేదల విలువ ఏంటో అందరికి తెలిసివస్తోందని ప్రధాని మోడి వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎవరు తీసుకున్నారని చరిత్ర గుర్తుంచుకోదని, నల్లధనానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు నిలబడిన విషయం చరిత్రలో నిలుస్తుందన్నారు. నాడు పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వెల్లడించినప్పుడు తాను యాభై రోజులు టైం అడిగానని, ఇప్పుడు కూడా అదే అడుగుతున్నానని అన్నారు. యాభై రోజుల తర్వాత పరిస్థితి అన్నీ సర్దుకుంటాయని మోదీ హామీ ఇచ్చారు.

Related posts:
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
అతడికి గూగుల్ అంటే కోపం
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
తెలంగాణకు ప్రత్యేక అండ
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
సదావర్తి సత్రం షాకిచ్చింది
సౌదీలో యువరాజుకు ఉరి
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
ఏపీకి ఆ అర్హత లేదా?
వంద, యాభై నోట్లు ఉంటాయా?
మోదీ ప్రాణానికి ముప్పు
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
వార్దాకు వణికిపోతున్న చెన్నై
పవన్ పంచ ప్రశ్నలు
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?
కాంగ్రెస్ నేత దారుణ హత్య
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments