డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..

Modi said only rich will cry but

ఒక్క ఫోటో వంద ఫీలింగ్స్ కు అద్దంపడుతుంది అని తెలుసు. కానీ మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తూర్పారబడుతుంది అని బహుశా ఈ ఫోటో తీసేటైంలో కూడా అతడు ఊహించలేదేమో. తాజాగా హిందుస్తాన్ టైమ్స్ పత్రికలో వచ్చిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని మోడీ చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాతి రోజు ఓ మీటింగ్ లో ఇలా అన్నారు. “దేశంలో ఇప్పుడు ధనవంతులు ఏడుస్తున్నారు, వారికి నిద్ర కూడా పట్టట్లేదు… కాని పేదవాడు సంతోషంగా ఉన్నాడు.. హ్యాపీ నిద్ర పోతున్నాడు” అని.

HT

కాని, ప్రస్తుతం దేశంలో అటువంటి పరిస్థితులు లేవు… రివర్స్ పరిస్థితులు ఉన్నాయి. ఎహె ఊరుకో…పేదవాడికి కొన్ని రోజులేగా ఈ తిప్పలు తర్వాత అంతా సర్దుకుంటుందని మోడీ చెప్పాడుగా అంటారా… అలా సర్దుకునే రోజులు వస్తాయా అనే డౌట్ ప్రస్తుతం దేశ ప్రజల్లో ఉన్నది. సరే.. ఇవన్ని పక్కన పెడితే… ఆ ముసలాయన బ్యాంక్ దగ్గర పొద్దటి నుంచి డబ్బుల కోసం క్యూ లో నిలబడి నిలబడి.. తర్వాత క్యూ లో నుంచి తప్పి పోవడంతో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న దృశ్యం అది. గూర్గావ్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ దగ్గర జరిగిన సంఘటన అది. ఆ ఫోటోను ముందు హిందూస్తాన్ టైమ్స్ పత్రిక పేపర్ లో వేసింది. అంతే కాదు క్యాప్సన్ కూడా సూపర్బ్ గా పెట్టింది . ఇక అప్పటి నుంచి ఆ ఫోటో ట్విట్టర్ లోతెగ వైరలయింది.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
సైన్యం చేతికి టర్కీ
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
ముద్రగడ సవాల్
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
చెరువుల్లో ఇక చేపలే చేపలు
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
బినామీలు భయపడే మోదీ ప్లాన్
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
ఆ నోట్లను ఏం చేయబోతున్నారంటే..
అవినీతి ఆరోపణల్లో రిజిజు
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ

Comments

comments