పార్లమెంట్‌లో మోదీ అందుకే మాట్లాడటంలేదట

Modi said that thats why he is not talking in Parliament

ప్రధాని నరేంద్ర మోదీ ఎంతటి మాటకారి అనేది అందరికి తెలుసు. అసలు గుజరాత్ ముఖ్యమంత్రి నుండి భారత ప్రధానిగా ఆయనకు పూలబాటలు వేసిందే ఆ మాటకారితనమే. అయితే తాజాగా ఆయన పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం మీద సమాధానం చెప్పాలని ఎంతలా అరుస్తున్నా కానీ దానికి మోదీ మాత్రం కిమ్మనడం లేదు. అయితే తాజాగా ఓ బహిరంగ సభలో ఆయన అసలు పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పారు. ఇంతకీ మోదీ ఎందుకు మాట్లాడటం లేదో తెలుసా..?

నోట్ల ర‌ద్దుపై త‌న‌ను లోక్‌స‌భ‌లో మాట్లాడ‌నివ్వడం లేద‌ని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. నోట్ల ర‌ద్దుపై చ‌ర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతూనే ఉంద‌ని, కానీ లోక్‌స‌భో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వకపోవడంతోనే బహిరంగ సభల్లో నోట్ల రద్దు పై మాట్లాడుతున్నట్లు ఆయన చెప్పారు. మనది నిస్వార్థభారతం అని, భవిష్యత్ తరాల కోసం అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా సాగుతున్నామని మోడీ స్పష్టం చేశారు. గుజరాత్ లోని దీసాలో జరిగిన సభలో మోడీ ప్రసంగించారు. పార్లమెంటులో జరుగుతున్న సభావ్యవహార శైలి రాష్ట్రపతిని కూడా అసహనానికి గురి చేసిందని విమర్శించారు.

అవినీతితో పేదలు, సామాన్యులు సంతోషంగా లేరని మోడీ గుర్తుచేశారు. నోట్లరద్దుతో నల్లధనం, తీవ్రవాదం, నకిలీ నోట్ల తయారీకి చెక్ పెట్టామని చెప్పారు. దేశం బలోపేతం కావడానికే పెద్దనోట్లను రద్దు చేశామని మోడీ వెల్లడించారు. ఏటీఎంల ముందు నిలబడి సమయాన్ని వృధా చేయరాదని ఈ-వ్యాలెట్ల‌తో మొబైల్‌లోనే బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించవచ్చని ప్రధాని తెలిపారు. అయితే నల్ల కుబేరులను ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టేది లేదని చెప్పారు. ఈ క్రమంలో అక్రమ మార్గంలో నల్లధనాన్ని మారుస్తున్న బ్యాంకు అధికారులపై కూడా పట్టుకున్నట్లు మోడీ తెలిపారు. ప్రజ‌ల గురించి మాట్లాడ‌టం కాద‌ని, ప్రజ‌ల కోసం ప‌నిచేయాల‌న్నారు. పేదల ఆర్థిక సామర్థ్యాన్ని పెంచేందుకే పెద్ద నోట్లను రద్దు చేశామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కానీ ఆ మాటలు వింటే మాత్రం కాస్త రాజకీయం తెలిసిన వాళ్లెవరైనా నవ్వుకుంటారు. పాపం ప్రతిపక్షాలకు మోదీ మాటలు వినిపించాయో లేదో? ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ మాటలు వింటే ఏమవుతారో??

Related posts:
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
బాబోయ్ బాబు వదల్లేదట
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
అమెరికా ఏమంటోంది?
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు
చెబితే 50.. దొరికితే 90
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?

Comments

comments