జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు

Jan

మోదీ ప్రభుత్వం మరోసారి అందరికి షాకిచ్చింది. నల్లధనం మీద యుద్ధం ప్రకటించిన మోదీ ఇప్పటికే సామాన్యుడికి అనేక కష్టాలు తీసుకువచ్చారు. తాజాగా జన్‌‌ధన్ యోజన అకౌంట్లు ఉన్న వారికి షాకిచ్చింది. మామూలు అకౌంట్లకు ఇప్పటికే షరతులు విధించిన మోదీ సర్కార్ ఇప్పుడు జన్‌ధన్ అకౌంట్లకు కష్టాలు తీసుకువచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ప్రకటించిన ఆపరేషన్ బ్లాక్ మనీలో భాగంగా  అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

నగదు విత్ డ్రా కోసం కొత్త పరిమితులను విధించింది. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఖాతాల నుంచి నగదు విత్ డ్రాకు పరిమితిని విధించింది. బినామీ ఆస్తి లావాదేవీ, డబ్బు లావాదేవీల నుంచి  అమాయక రైతులు, గ్రామీణ ఖాతాదారుల రక్షించడానికి వీలుగా విత్ డ్రా లిమిట్ ను పదివేలకు కుదిస్తున్నట్టు వెల్లడించింది. కేవైసీ  ఖాతాదారులకు నెలలో పదివేలు, నాన్ కేవైసీ  ఖాతాదారులకు ఒక నెలలో అయిదువేలు విత్ డ్రాకు అనుమతినిస్తూ ఆర్బీఐ ఒక ప్రకటన జారీ చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రైతులు, ఇతర ఖాతాదారులకు అక్రమ లావాదేవీలనుంచి రక్షణ కల్పించేందుకుగాను  ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే 10వేలకు పైన విత్ డ్రాకు  సరియైన ఆధారాలు, పత్రాలు చూపించిన తరువాత బ్యాంక్ మేనేజర్ అనుమతితో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. నాన్ కేవైసీ ఖాతాదారుల గరిష్ట విత్ డ్రా పరిమితిని పదివేలుగా నిర్ణయించింది.

Related posts:
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
స్టే ఎలా వచ్చిందంటే..
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
జియోకే షాకిచ్చే ఆఫర్లు
కాశ్మీర్ భారత్‌లో భాగమే
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
బాబు బిత్తరపోవాల్సిందే..
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే

Comments

comments