డిసెంబర్ 31న మోదీ స్పీచ్

Modi speech on December 31 night

మోదీ..దేశం మొత్తంలో ఎక్కడైనా ఇప్పుడు ఈ పేరంటే ఓ రకమైన భయం. నవంబర్ ఎనిమిదో తేది రాత్రి పెద్దనోట్లను రద్దు చేసిన దేశానికి షాకిచ్చిన మోదీ.. మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పెద్ద బాంబ్ పేల్చిన మోదీ దేశ ప్రజలతో యాభై రోజుల టైం అడిగారు. మరి ఆ యాభై రోజుల టైం కూడా ముగిసింది. అయితే ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఏం మాట్లాడతారు అనేది ఎవరికి అంతుపట్టని ప్రశ్నగా మిగిలింది. మరో బాంబ్ పేలుస్తారా? లేదంటే జనాలకు మంచి చేసే ప్రకటన చేస్తారా? అనేది చూడాలి.

ఆర్థిక ముసలాన్ని భారంగా మోస్తున్న భారతీయులకు ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్పబోతున్నారు. యాభై రోజులు కళ్లు మూసుకోండి అన్నీ సరిచేస్తా… అంటూ మోడీ తీసుకున్న యాభై రోజుల గడువు ముగిసింది. ప్రజలు ఓపిగ్గా క్యూలైన్లలో వేచి మరీ కేంద్రానికి బాసటగా నిలచారు. ఇది కూడా దేశభక్తిని చాటడమేనంటూ నినాదాలు చేసినవారూ ఉన్నారు. గడువు ముగిసింది. నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని మోడీ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మోడీ ప్రసంగాన్ని దూరదర్శన్ ప్రసారం చేయనుంది. డిసెంబరు 31వ తేదీ రాత్రి 7.30 నిమిషాలకు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.

నవంబరు 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రధాని ప్రసంగించాలని భావించడం ఉత్కంఠ రేపుతోంది. ఆర్థిక రంగంలో నెలకొన్న అనిశ్చితికి సమాధానం చెప్పడంతో పాటు మరికొన్ని కఠిన నిర్ణయాల్ని మోడీ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు, బినామీ వ్యవహరాలపై పదునైన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. దీనిపై వ్యతిరేకత తలెత్తకుండా పార్టీని కూడా తగిన విధంగా సమాయత్తం చేయాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. ప్రధాని ప్రసంగం తర్వాత భారీగా కార్యాచరణ అమలుచేసేందుకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం.

Related posts:
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
ఆయనకు వంద మంది భార్యలు
గుజరాత్ సిఎం రాజీనామా
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
పిహెచ్‌డి పై అబద్ధాలు
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
సదావర్తి సత్రం షాకిచ్చింది
సల్మాన్ ను వదలని కేసులు
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
బాబును వదిలేదిలేదు
న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్

Comments

comments