బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్

Modi Surgical Strike on Black money

ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ లో ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ కు దిగితే…ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా దేశంలోని పేరుకుపోయిన నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్స్ కు దిగారు. కనీసం చిన్న అనుమానం కూడా రాకుండా మోదీ చేసిన ప్రకటన దేశంలో ప్రకంపనలు రేపుతోంది. నేటి అర్ధరాత్రి నుంచి 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. బ్లాక్ మనీని రద్దు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. 500 రూపాయలు నోట్లు, 1000 రూపాయల నోట్లు నవంబర్ 10 నుంచి డిసెంబర్ 31 వరకు బ్యాంకులు లేదా పోస్టాఫిసులలో జమచేయాలని ఆయన సూచించారు. దీనికి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరని అన్నారు. అప్పటికి మిగిలిపోతే మార్చ్ వరకు గడువు ఉంటుందని ఆయన చెప్పారు.

అలాగే వారానికి కేవలం 20 వేల రూపాయలు మాత్రమే డ్రా చేయాలని, అంతకు మించిన మొత్తం డ్రా చేయరాదని ఆయన సూచించారు. రోజుకు పది వేల రూపాయలకు మించి విత్ డ్రా చేయరాదని ఆయన తెలిపారు. అలాగే 500, 1000 రూపాయల నోట్ల ముద్రణను రద్దు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. బ్లాక్ మనీ నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, ఈ నోట్లను రద్దు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. నవంబర్ 12 వరకు 500 లేదా 1000 రూపాయల నోట్లు మందుల షాపులు, రైల్వే, బస్, విమాన టికెట్ కౌంటర్లు వంటి ప్రాంతాల్లో మాత్రమే చెల్లుతాయని ఆయన స్పష్టం చేశారు.

Related posts:
భర్తను వదిలి ప్రియుడితో ప్రేమ.. ఇది 2016 లవ్‌స్టోరీ
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
అతడికి గూగుల్ అంటే కోపం
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
యుపీలో ఘోర రైలు ప్రమాదం
మోదీ హీరో కాదా?
జియోకు పోటీగా ఆర్‌కాం
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
జియో భారీ ఆఫర్ తెలుసా?
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్
వార్దాకు వణికిపోతున్న చెన్నై
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?

Comments

comments