మన ఖాతాలే మోదీ టార్గెట్?

Modi targets our bank accounts

భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేసే పనిలో ఉన్నారు.అయితే అందులో భాగంగా అందరూ కూడా నగదును కాకుండా క్యాష్ లెస్ సేవలను వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు. కాగా మోదీ దేశంలో ఇప్పటి దాకా అమలులో ఉన్న అన్ని రకాల ట్యాక్స్ లను రద్దు చేస్తారు అని ప్రచారం సాగుతోంది. అయితే మోదీ అన్ని ట్యాక్స్ లను రద్దు చేసి ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారు అనేది ప్రశ్న. మోదీ ట్యాక్స్ లను రద్దు చేస్తే ఖజానా మొత్తం ఖాళీ అవుతుంది. మరి ఖజానా ఖాళీ అయితే ప్రభుత్వం నడవడం కష్టం. అయితే మోదీ దీనికి పరిష్కారంగా మన బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేశారు అని వార్త హల్ చల్ చేస్తోంది.

ఇంతకీ మోదీ ప్లాన్ ఏంటీ అంటే దేశవ్యాప్తంగా అన్ని రకాల ట్యాక్స్ లను రద్దు చేసి కేవలం రెండు రకాల ట్యాక్స్ లను మాత్రమే అమలు చేస్తారని వినికిడి. అయితే దేశంలో జీఎస్టీతో పాటుగా బిబిటి వేస్తారని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ బిబిటి అంటే ఏమిటంటే మన బ్యాంకు ఖాతాల నుండి ట్రాన్స్ వర్ అయ్యే డబ్బుల మీద ట్యాక్స్ అన్న మాట. ఉదాహరణ మనం బ్యాంకు ఖాతాల నుండి ఓ పది వేలు ఎవరికైనా ఆన్ లైన్ ద్వారా పే చేస్తే దానిపై ఓ ట్యాక్స్ వేస్తారు. అయితే ఇలా బిబిటిని రెండు శాతంగా ఉంచుతారు అని తెలుస్తోంది. దేశంలో అందరికి అకౌంట్లు ఉండి, అకౌంట్లలో జరిగే అన్ని రకాల ట్రాన్సాషన్స్ పై ఇలా ట్యాక్స్ విధిస్తారు. ఇలా మోదీ మన ఖాతాలను టార్గెట్ చెయ్యడం ద్వారా ఖజానాను నింపుతాడు అనే అభిప్రాయం ఉంది. అయితే అందరికి అకౌంట్లు ఉండటం దీనికి మన దేశంలో అతి పెద్ద సవాల్. మరి మోదీ దీనిపై ఎలాంటి చర్యలకు దిగుతాడో వేచిచూడాలి.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
గులాబీవనంలో కమలం?
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
అహా... అందుకేనా..?!
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు!

Comments

comments