మోదీ ఒక్కడే తెలివైనోడా?

Modi think alone are intelligent

భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నుండి మమతా బెనర్జీ నేషనల్ పాలిటిక్స్ పై దృష్టిసారించారు. ముఖ్యంగా మోదీ తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న వారిలో మమతా బెనర్జీ మొదటి వ్యక్తి. మోదీ నోట్లు బంద్ చేస్తే ప్రజలు ఓట్లు బంద్ చేస్తారంటూ మోదీకి గట్టి చురకలే అంటించారు మమతా. తాజాగా మోదీ తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల బ్యాంకు లావాదేవీల వివరాలను సమర్పించాలని కోరిన అంశంపై మమతా బెనర్జీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. నరేంద్ర మోదీ ఒక్కరే తెలివైన వారని అనుకుంటున్నారా? అని ఎదురుప్రశ్న వేస్తున్నారు మమతా.

నరేంద్ర మోదీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తమ బ్యాంకు లావాదేవీల స్టేట్ మెంట్లను పార్టీకి అందించాలని సూచించారు. ఈ మేరకు బిజెపి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ నేతలకు ఆదేశాలుజారీ చేశారు. నవంబర్ 8 నుండి డిసెంబర్ 30 వరకు ప్రజాప్రతినిధుల బ్యాంకు స్టేట్ మెంట్ లను అందించాలని ఆర్డర్ పాస్ చేశారు. అయితే దీనిపై మమతాబెనర్జీ తీవ్ర విమర్శ చేశారు. మోదీ కేవలం నవంబర్ 8 నుండి డిసెంబర్ 30 వరకు మాత్రమే ఎందుకు? గత రెండున్నర సంవత్సరాల బ్యాంకు స్టేట్ మెంట్ ను ఎందుకు తీసుకోరాదు? అని ప్రశ్నించారు. మోదీ తాను ఒక్కడిని మాత్రమే తెలివైన వాడినని అనుకుంటున్నాడని.. మమతా విమర్శించారు. మరి మోదీ మమతా బెనర్జీ చేసిన విమర్శకు స్పందిస్తారో? లేదంటే లేని తలనొప్పి ఎందుకు అని ఊరుకుంటారో చూడాలి.

Related posts:
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
నయీం బాధితుల ‘క్యూ’
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
గెలిచి ఓడిన రోహిత్ వేముల
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
అడవిలో కలకలం
ఆ సిఎంను చూడు బాబు...
బిచ్చగాళ్లు కావలెను
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?

Comments

comments