వాళ్లను వదిలేదిలేదు

modi-answer

Modi warned who behind the Uri attack.For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

ఎన్ని సార్లు చెప్పినా పక్క దేశం పాకిస్థాన్ మాత్రం తన బుద్ధిని మార్చుకోవడం లేదు. భారత్ స్నేహ హస్తం అందిస్తుంటే పాక్ మాత్రం దొంగ దెబ్బ తీస్తోంది. పాక్ తో దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారీ ఆ దేశం మరింత దూరంగా జరుగుతోంది. వెన్నుపోట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ లో ఆర్మీ బేస్ క్యాంప్ పై పాక్ ముష్కరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ముష్కరుల దాడిలో 20మంది జవాన్లు అమరులయ్యారు.

భారత్ పై ఇలా దాడులు చేయడం పాక్ కు కొత్తేమీ కాదు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి బస్సు దౌత్యంతో దాయాది దేశానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తే ఆ వెంటనే కార్గిల్ రూపంలో పాక్ వెన్నుపోటు పొడిచింది. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా పాక్ తో సత్సంబంధాలు నెరిపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంటే పాక్ తన నమ్మక ద్రోహాన్ని, నయ వంచనను మరోమారు బయటపెట్టుకుంది.

ఇటీవల ఆఫ్గనిస్థాన్ వెళ్లిన ప్రధాని మోదీ.. వస్తూవస్తూ పాక్ వెళ్లి నవాజ్ తల్లి షమీమ్ అక్తర్ పాదాలకు నమస్కరించి, షరీఫ్ మనవరాలి పెళ్లికి హాజరై వచ్చారు. మోదీ చొరవను ప్రపంచం మొత్తం కీర్తించింది. దీనిని తట్టుకోలేకపోయిందో ఏమో పాక్ మరోమారు తన నైజాన్ని ప్రదర్శించింది. యూరీలోని ఆర్మీ బేస్ పై దాడి చేసి తమకు స్నేహం చెయ్యడం చేతకాదని నిరూపించింది. ఏది ఏమైనా పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. పాక్ ను దెబ్బకు దెబ్బ తీయాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.

ఇప్పటికే పాకిస్థాన్ కు భారత్ చాలా సార్లు ఛాన్స్ లు ఇచ్చిన మాట వాస్తవం. పాకిస్థాన్ ఎన్ని సార్లు దొంగదెబ్బ తీసినా కానీ భారత్ మాత్రం సమాధానం చెప్పకుండా చేతులు ముడుచుకుని కూర్చుంది. పటాన్ కోట్ లో మన ఎయిర్ బేస్ మీద దాడికి పాల్పడితే పాకిస్థాన్ మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అన్నింటికి మించి మోదీ విదేశాల నుండి పెట్టుబడులను తీసుకురావడం కన్నా మన సైనికుల ప్రాణాలను కాపాడటం ఎంతో ముఖ్యం. ఈ ఘటనకు కారకులైన వారు శిక్ష నుండి తప్పించుకోలేరు అని మోదీ ట్వీట్ చేశారు. కానీ దేశానికి అలాంటి ట్వీట్ల కన్నా… వాటి ఫలితాలు కనిపిస్తేనే శాంతిస్తారు.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
హరీష్.. ఇది నీకు సరికాదు
ఆయనకు వంద మంది భార్యలు
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
సైన్యం చేతికి టర్కీ
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
ఆ సిఎంను చూడు బాబు...
అమ్మ పరిస్థితి ఏంటి?
వార్దాకు వణికిపోతున్న చెన్నై
అవినీతి ఆరోపణల్లో రిజిజు
ఛాయ్‌వాలా@400కోట్లు
వంద విలువ తెలిసొచ్చిందట!
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments