‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది

Modi warning works on Jandhan Yojana Bank

దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఒక్కసారిగా కలకలం మొదలైంది. అప్పటిదాకా పెద్దనోట్లను దాచిపెట్టుకున్న బడాబాబులు ఆ డబ్బులను ఎలా దాచిపెట్టుకోవాలో అర్థంకాని విచిత్ర పరిస్థితి. అయితే నల్లధనాన్ని పేదల కోసం ప్రధానమంత్రి ఓపెన్ చేయించిన జన్ ధన్ అకౌంట్లలె జమచెయ్యడం మొదలుపెట్టారు. తాజాగా జన్‌ధన్ ఖాతాల్లో నగదు జమలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నదని, ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ నిలిచాయని ఆర్థిక శాఖ తన నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం జన్‌ధన్ ఖాతాల్లో డిసెంబర్ 7 నాటికి రూ.74,610 కోట్లు జమ అయ్యాయని పేర్కొన్నది. ఉత్తర ప్రదేశ్‌లో 3.8 కోట్ల ఖాతాలు ఉండగా వాటిల్లోకి రూ.12,021 కోట్లు జమ అయ్యాయి.

పశ్చిమ బెంగాల్‌లో 2.44 కోట్ల ఖాతాలు ఉండగా రూ.9,194 కోట్లు, రాజస్థాన్‌లోని 1.9 కోట్ల ఖాతాల్లో రూ.6,291 కోట్లు, బీహార్‌లో 2.62 కోట్ల ఖాతాలు ఉండగా రూ.6,160 కోట్ల వచ్చి చేరాయి. నోట్లరద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాత నెలరోజుల్లో ఖాతాల్లోకి రూ.28,973 కోట్లు జమ అయ్యాయి. అయితే ఇప్పటికీ 20 శాతం జన్‌ధన్ ఖాతాల్లో డబ్బు లేదని నివేదిక పేర్కొన్నది. జన్‌ధన్ ఖాతాలను అక్రమార్కులకు సహాయపడేలా, నల్లధనం మార్చుకోవడానికి వినియోగించవద్దని, పరిమితి దాటితే ఐటీ అధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని గతవారం కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన తర్వాత ఖాతాల్లోకి డబ్బు జమ తగ్గిందని వివరించింది. మొత్తానికి నరేంద్ర మోదీ ఇచ్చిన వార్నింగ్ బాగానే పనిచేసినట్లు కనిపిస్తోంది.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
సల్మాన్ ఖాన్ నిర్దోషి
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
బావర్చి హోటల్ సీజ్
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
ఈ SAM ఏంటి గురూ..?
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
సౌదీలో యువరాజుకు ఉరి
2018లో తెలుగుదేశం ఖాళీ!
మంత్రుల ఫోన్లు బంద్
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
చెబితే 50.. దొరికితే 90
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
శోభన్ బాబుతో జయ ఇలా..
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

Comments

comments