నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్

Most Corrupted State in India is Andhra Pradesh

ఒకప్పుడు అవినీతి అనే మాటకు చంద్రబాబుకు చాలా దూరం అనే వాళ్లు. కానీ తాజాగా ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ మాటకు కాలం చెల్లింది అనే వార్తలు వస్తున్నాయి. అందుకు చాలా కారణాలే కనిపిస్తున్నాయి. అమరావతి భూముల దగ్గరి నుండి, తాజాగా పోలవరం టెండర్ల వరకు అన్నింటిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతికి తావిస్తోందని వార్తలు వస్తున్నాయి. వాటికి బలం చేకూరుస్తూ తాజాగా దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ప్లేస్ కొట్టేసింది. మరోసారి అవినీతి ఆరోపణలపై ఓ ప్రముఖ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. అందులో అవినీతికి అవకాశాన్ని చంద్రబాబు సర్కార్ ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తెలుస్తోంది.

ఎప్పుడో పూర్తి కావలసిన పనులను కావాలనే.. ముడుపుల కోసం తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారని.. వాటిని కావాలనే వాయిదా వేయిస్తున్నారని అందులో పేర్కొన్నారు. పైగా కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్న టైంలో.. టెండర్లు కాకుండా నామినేటెడ్ పద్దతిలో టెండర్లను కట్టబెట్టాలని నేతలు ప్లాన్ వేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.  నిజానికి ప్రాజెక్టు వ్యయం రూ.5 లక్షలు మించని పనులకైతేనే నామినేషన్ విధానంలో కాంట్రాక్టులను కేటాయించే అవకాశం ఉంది. అంతకుమించిన వ్యయంతో కూడిన పనులకు ఖచ్చితంగా టెండర్ల ప్రక్రియ ద్వారానే కాంట్రాక్టులు ఖరారు చేయాల్సి ఉంది.

అయితే కావాలనే పుష్కర పనుల విషయంలో జాప్యం చేస్తూ వస్తోన్న టీడీపీ నేతలు, పనులు ఆలస్యంగా ప్రారంభమైతే టెండర్ల ప్రక్రియ ద్వారా కాంట్రాక్టులను కట్టబెట్టడానికి మరింత సమయం పడుతుంది కాబట్టి, అలా కాకుండా నేరుగా నామినేషన్ విధానంలో తమకు కమిషన్లు ముట్టజెప్పే వారికే కాంట్రాక్టులు కట్టబెట్టడానికి టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇదే తరహాలో ఆర్ అండ్ బీ డిపార్ట్ మెంటుకు చెందిన ఓ ఇంజనీర్ బావమరిదికి కోట్లాది రూపాయల విలువ చుసే విద్యుత్ కాంట్రాక్టు పనులను అధికారులు ఎలాంటి సమీక్ష లేకుండా పెట్టారనే ఆరోపణ కూడా చేసింది. మొత్తం ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ కలిసి ఈ అక్రమాలకు తెరలేపారని పత్రిక చెబుతోంది. ఇదిలా ఉంటే, ఓవైపు ఆర్థికంగా కష్టాలున్నాయని చెప్పుకునే ప్రభుత్వం కృష్ణా పుష్కరాల కోసం రూ.1080 కోట్లు ఖర్చు చేయనున్నట్టుగా ప్రకటించినా.. ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపింది టైమ్స్ ఆఫ్ ఇండియా.

Related posts:
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
అతడి అంగమే ప్రాణం కాపాడింది
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
సింగ్ ఈజ్ కింగ్
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
కాశ్మీర్ భారత్‌లో భాగమే
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
జియో భారీ ఆఫర్ తెలుసా?
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
ఆ క్యాలెండర్‌లో చెప్పిందే జరిగిందా?

Comments

comments