ముద్రగడ సవాల్

Mudragada Challenges Chandrababu Naidu

Mudragada Challenges Chandrababu Naidu. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి ఎండాకాలాన్ని తలపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు మనోళ్లు, పరాయోళ్లు అని తేడా లేకుండా చంద్రబాబుతో ఓ ఆట ఆడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు, ఓటుకు నోటు కేసు తిరగతోడడం, ఇప్పుడు వద్దుమొర్రో అన్నా కేంద్రం ‘ప్రత్యేక హోదా’ లేదని చెప్పకనే చెప్పడం, హైదరాబాద్‌లో చివరి మూడరోజుల అసెంబ్లీ మటాష్ అయిపోవడం, ఇప్పుడు ముద్రగడ అంతెత్తున చంద్రబాబుపై లేవడం.. ఇదంతా చూస్తుంటే చంద్రబాబుకు ఇంకొక బ్రేక్ అవసరం అన్నట్లుంది.

కాపు సామాజిక వర్గ నాయకుడు ముద్రగడ పద్మనాభం 11-09-2016 తేదీనాడు అన్ని జిల్లాలనుండి కాపు, అదే సామాజిక వర్గానికి చెందిన కులాల పెద్దలను పిలిచి ఒక JAC మీటింగ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం.. కాపులకు చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, దానిపై తాత్సార్యం చేయడంపై ముద్రగడ, తదితరులు తమ పోరాటం గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ సభను ఉద్దేశిస్తూ.. చంద్రబాబుకు ముద్రగడ అనేక అంశాలపై ఘాటుగా సూచనలు చేస్తూ కొన్ని సందర్భాల్లో ఆవేదన వ్యక్తపరిచారు. ముఖ్యంగా.. తనపైకి తెలుగుదేశంలో ఉన్న కాపు సోదరులను ఉపయోగిస్తున్నారని, వారితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారని, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిమధ్య చీలికలు తీసుకొచ్చారని, ఇది చాలా దారుణమని వ్యాఖ్యానించారు.

కాపు సామాజిక వర్గం ఓట్లతో గెలిచి, ఆ తర్వాత వారినే నడివీధుల్లో నిలబెట్టడం అన్యాయమని బాధపడ్డారు. తనపై కావాలని అభాండాలు వేస్తున్నారని, కాపు కులంలో తను చెడపుట్టానని, ఆ వర్గాన్ని తాను తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా.. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. తుని సంఘటనకు సంబంధించి తప్పుడు కేసులతో ఇబ్బందిపెడితే కాపు ఉద్యమాన్ని వదులుకుంటాడని చంద్రబాబు అనుకున్నారని, కానీ తను ఉద్యమం వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఎందుకు పెట్టిన కేసును తొమ్మిది నెలలుగా ముందుకు వెళ్ళలేదని ఎదురు ప్రశ్నించారు. తనను చంద్రబాబు తన సామాజిక వర్గం నుండి విడగొట్టాలని చూస్తున్నారని, చేతనైతే ‘తుని’లాంటి సభను నిర్వహించాలని, ఈ రాష్ట్రం నుండి వెళ్లేలా చేయమని, కట్టుబట్టలతో ప్రజల కోసం వెళ్ళిపోతానని సవాల్ విసిరారు.

Related posts:
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
కాటేసిందని పాముకు శిక్ష
బాబోయ్ బాబు వదల్లేదట
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
బాబు గారి అతి తెలివి
మంత్రుల ఫోన్లు బంద్
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
ఆ సిఎంను చూడు బాబు...
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
అకౌంట్లో పదివేలు వస్తాయా?
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
తిరిగిరాని లోకాలకు జయ
శోభన్ బాబుతో జయ ఇలా..
బాబును వదిలేదిలేదు

Comments

comments