టాప్ గేర్ లో ముద్రగడ

Mudragada

కాపుల ఉద్య‌మం.. ప్ర‌స్తుతం చాప‌కింద నీరులా ఉంది. తుని ఘ‌ట‌న‌కు సంబంధించిన కొంత‌మందిని పోలీసులు అరెస్టు చేస్తుంటే ముద్ర‌గ‌డ ఆ మ‌ధ్య ఉద్య‌మించిన సంగ‌తి తెలిసిందే. ఆ సంద‌ర్భంగా నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. దీక్ష ప్రారంభించాగానే పోలీసులు రంగంలోకి దిగ‌డం, పురుగుల మందు డ‌బ్బా ప‌ట్టుకుని ముద్ర‌గ‌డ భ‌య‌పెట్ట‌డం, అనంత‌రం ఆసుప‌త్రిలో చోటుసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో అరెస్టులు చేసిన‌వారిని బెయిల్‌పై విడిచిపెట్ట‌క త‌ప్ప‌లేదు. అయితే, ఆ త‌రువాతి నుంచి ముద్ర‌గ‌డ పెద్ద‌గా వార్త‌ల్లో లేరు. కానీ, ఇప్పుడు మ‌రోసారి ఉద్య‌మించేందుకు స‌మాయ‌త్తం అవుతున్నార‌ని తెలుస్తోంది.

కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశ‌మై ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడికి ఇచ్చిన గ‌డువు ఈ నెలాఖ‌రుతో పూర్త‌వుతుంద‌ని ముద్ర‌గ‌డ చెబుతున్నారు. ఈలోగా కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై ప్ర‌క‌టన చేయాల్సి ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. ఒక‌వేళ ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోక‌పోతే మ‌రోసారి త‌మ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించాల్సి ఉంటుంద‌ని ముద్ర‌గ‌డ హెచ్చ‌రించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో చిరంజీవి, అంబటి రాంబాబు, దాసరి నారాయణలాంటి నాయకులు ముద్రగడతో సమావేశమయ్యారు.

ఎన్నిక‌ల ముందు కాపుల‌ను న‌మ్మించి, ఓట్లు వేయించుకుని ముఖ్య‌మంత్రి సీటులో చంద్ర‌బాబు కూర్చున్నార‌నీ, గ‌తంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల‌ని మాత్ర‌మే తాము కోరుగుతున్నామ‌ని ముద్ర‌గ‌డ అన్నారు. రిజ‌ర్వేష‌న్లపై సెప్టెంబ‌ర్ తొలివారంలో ఏదో ఒక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్టు ముద్ర‌గ‌డ అంటున్నారు. ఒక‌వేళ అలాంటి ప్ర‌క‌ట‌న ఏదీ రాక‌పోతే సెప్టెంబ‌ర్ 11న రాజ‌మండ్రిలో అన్ని జిల్లాల కాపు సంఘాల నేత‌ల‌తో విస్తృత స్థాయి స‌మావేశం ఏర్పాటు చేస్తామ‌ని, భ‌విష్య‌త్తులో ఉద్య‌మాన్ని మ‌రింత ఉద్ధృతం ఎలా చేయాలో నిర్ణ‌యించి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని ముద్ర‌గ‌డ అన్నారు.

మొత్తానికి మ‌రోసారి కాపు ఉద్య‌మం వేగం పుంజుకునేట్టుగానే క‌నిపిస్తోంది. ముద్ర‌గ‌డ దీక్షకు దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో చంద్రబాబు స‌ర్కారుకు అనుభ‌వ‌మే. ముద్ర‌గ‌డ ప‌ట్టుద‌ల ఎలా ఉంటుందో వారికి బాగా తెలుసు! మరి తాజాగా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు అన్నది చూడాలి. ముద్రగడ మాత్రం టాప్ గేర్ లో దూసుకెళుతున్నారు. కాపు రిజర్వేషన్ల విషయంలో ఆయన దూకుడును చంద్రబాబు సర్కార్ ఎలా ఎదర్కోగలదు.. ఎలా తట్టుకోగలరు అన్నది చూడాలి.

Related posts:
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
పవన్ చంద్రుడి చక్రమే
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
ఎవరు చాణిక్యులు..?
నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
పవన్ క్షమాపణలు చెప్పాలి
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?

Comments

comments