చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం

Mudragada padmanabham planning to protest aganist Chandrababu Naidu

కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు కాపుపెద్దల నుంచి మద్దతు, ఆమోదముద్ర లభించింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నియోజకవర్గం నుంచి ముద్రగడ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెలాఖరులోగానీ వచ్చే నెల మొదటి వారం నుంచి గానీ ముద్రగడ పాదయాత్ర ప్రారంభించనున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి ఉద్యమాన్ని బాగా పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లేందుకు పెద్ద స్కెచ్ వేశారు ముద్రగడ.

ఉద్యమాన్ని తీవ్రతరం చెయ్యడానికి కాపువర్గానికి చెందిన ఐఏఎస్, ఐపిఎస్, ఇతర ఉన్నతాధికారులతో ఒక సలహా మండలి ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఒక సెక్రటేరియేట్‌ను, అధికార ప్రతినిధులను నియమిస్తారు. ప్రతి జిల్లాకు 30 మందితో జాక్ కమిటీలను ఏర్పాటు చేస్తారు.ఉద్యమంలో భాగంగా భిక్షాటన చేయాలన్న జిల్లా నేతల సూచనలను కాపు పెద్దలు తప్పుపట్టారు. తమకు భిక్ష పెట్టాల్సిన అవసరం లేదని, పోరాడి సాధించుకోవాలని స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితమే కాపులుగా ఉన్న తమను నీలం సంజీవరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం(నవంబర్ 1) రోజున బీసీ హోదా నుంచి తొలగించినందున, ఇకపై ఆ రోజును బ్లాక్‌డేగా పరిగణించాలని నిర్ణయించారు. కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ, అన్ని పార్టీల నుంచి మంజునాధ కమిషన్‌కు లేఖ ఇప్పించేలా ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. జాక్‌లో ఇకపై అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ప్రతి 15రోజులకోసారి వినూత్న నిరసనలు చేపట్టనున్నారు.

ప్రతి 15 రోజులకు ఒకసారి కాపు ఉద్యమంతో కాపు నాయకులు కాకరేపేందుకు సిద్ధమవుతున్నారు. ముద్రగడ చేసే ఉద్యమ పంథా చాలా భిన్నంగా ఉంటుంది. గతంలో ఇచ్చిన హామీలను అమలు జరిగేలా ముద్రగడ చేస్తున్న వత్తిడికి తాజాగా మరింత రాజకీయ మద్దతు తోడవుతుండటంతో తెలుగు తమ్ముళ్లలో భయం మొదలైందని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు సర్కార్ కు కొరకరాని కొయ్యగా మారిన ముద్రగడ.. తాజాగా 15 రోజులకు ఒకసారి ఉద్యమించడం మరింత చేటుచేస్తుందని అందరూ భావిస్తున్నారు. మరి చూడాలి 15 రోజులకు ఒకసారి జరిగే కాపు ఉద్యమాన్ని ఎలా నిలువరిస్తాడో చంద్రబాబు.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
వీళ్లకు ఏమైంది..?
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
రాజీనామాలు అప్పుడే
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
బాబు గారి అతి తెలివి
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
చంద్రబాబు చిన్న చూపు
అమెరికా ఏమంటోంది?
యుపీలో ఘోర రైలు ప్రమాదం
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
తిరిగిరాని లోకాలకు జయ

Comments

comments