కాళ్లు పట్టుకున్నది నువ్వే..

mudra gadda

కాపు సామాజిక వర్గం కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం ఇటీవల జరిగిన జెఎసి మీటింగ్ లొ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. మొదట ఈ మీటింగ్ ను 08.09.2016 అనుకున్నప్పటికీ దీనిని పవన్ కళ్యాణ్ బహిరంగ సభ 09.09.2016 ఉండటం కారణంగా వాయిదా వేసుకొని 11.09.2016 తేది నాడు ఏర్పాటు చేసుకున్నారు. అయితే తమ బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదని, ఇవ్వట్లేదని కనీసం ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నా కూడా నానా ఇబ్బందులు పెడుతున్నారని ముద్రగడ తెలిపారు.

చంద్రబాబు ముద్రగడపై అంతకుముందు చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చుకొని తన ఆవేదన వ్యక్తం చేశారు.

నన్ను వైయస్ఆర్ కాళ్లు పట్టుకున్నానని అంటావా.. నువ్వు, మీ బావమరిది బాలకృష్ణ రివాల్వర్ కాల్పుల కేసులో ఇరుక్కొంటే.. రాత్రికి రాత్రి వేరే వాళ్ల కారులో వెళ్లి వైయస్ఆర్ కాళ్లు పట్టుకొంది నువ్వు కాదా..? అని ప్రశ్నించారు. వైయస్ఆర్ కాళ్లు పట్టుకుని, బాలకృష్ణను కనీసం ఒక గంట కూడా అరెస్టు చెయ్యకుండా కేసు మాఫీ చేసుకున్నావ్ అని ఆరోపించారు.

అదే విధంగా మరొక సంఘటన గుర్తు చేసుకుంటూ.. చంద్రబాబు నువ్వు ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా దొరికిపోతే, కేసీఆర్ కాళ్లు పట్టుకుంటే దానికి నీకు హైదరాబాద్ నుండి వెళ్లిపోవాలని చెబితే.. అక్కడి నుంచి పారిపోయి వచ్చేశావ్‌.  నేను ఎవరి కాళ్లు పట్టుకోలేదు. కాళ్లు పట్టుకుని బయటపడేది నువ్వు సుమా! అని ముద్రగడ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. చంద్రబాబును కడిగేశారు.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
ఉక్కిరిబిక్కిరి
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
ప్రత్యేక హోదా లాభాలు
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
చెత్త టీంతో చంద్రబాబు
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
మీకో దండం.. ఏం జరుగుతోంది?
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ

Comments

comments