నజీబ్ జంగ్ రాజీనామా

Najeeb Jung's sudden exit as lieutenant governor

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో నియమితుడైనా కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా పనిచేస్తున్న నజీబ్‌ జంగ్‌ హఠాత్తుగా రాజీనామా నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరచింది. నజీబ్‌ జంగ్‌ తన రాజీనామా లేఖలో ఎలాంటి కారణాలను పేర్కొనలేదు. తన పదవీకాలంలో సహాయ సహకారాలు అందించినందుకు ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రాజీనామాకు ఆప్‌ ప్రభుత్వంతో ఉన్న ఉప్పు-నిప్పు సంబంధాలు కారణం కాదని సన్నిహితులు తెలిపారు. తనకు అత్యంత ఇష్టమైన బోధనా రంగానికి తిరిగి వెళ్లాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారని చెప్పారు. జంగ్‌ రాజీనామా తనను ఆశ్చర్య పరచిందని కేజ్రీవాల్‌ అన్నారు.

‘‘జంగ్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా బాగా పని చేశారు. ఆయనకు వేరే ఆలోచన ఏదో ఉన్నట్లుంది’’ అని బీజేపీ నేత ఆర్‌పీఎన్‌సింగ్‌ అన్నారు. జంగ్‌ను అవమానకరంగా తొలగించారని ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ మాకెన్‌ ఆరోపించారు. ఆర్‌ఎస్ఎస్‌ వ్యక్తిని కూర్చోబెట్టేందుకే ఆయన్ను తప్పించారని అన్నారు. పలువురు గవర్నర్లను బీజేపీ ప్రభుత్వం అవమానకరంగా తొలగించడంతో జంగ్‌ జాగ్రత్త పడ్డారని మరో కాంగ్రెస్‌ నేత పీసీ చాకో అభిప్రాయపడ్డారు. తమ సర్కారుతో జంగ్‌ ప్రవర్తించిన తీరు ఆయన నిజ వ్యక్తిత్వం కాదని, మోదీ ఒత్తిడితోనే ఆయనలా వ్యవహరించి ఉంటారని ఆప్‌ వ్యాఖ్యానించింది. బీజేపీ ఎమ్మెల్యే విజేందర్‌ గుప్తా మాత్రం ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వ వైఖరితో జంగ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. బుధవారం తాము లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ను కలిసినపుడు ఆయన మాటల్లో రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి ధ్వనించిందని, రాజీనామా చేస్తారని ఊహించలేదని చెప్పారు.

అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కోరిక మేరకు నజీబ్‌ జంగ్‌ రాజీనామా చేశాడు అనే వార్తలు వస్తున్నాయి. మోడీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాడు అనే టాక్‌ కూడా వినిపిస్తుంది. త్వరలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికలు జరుగబోతున్నాయి. అందుకోసం ఇప్పటి నుండే మోడీ చర్యలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఉపరాష్ట్రపతి పదవికి నజీబ్‌ జంగ్‌ను ఎంపిక చేయాలనే ఉద్దేశ్యంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేయించినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Related posts:
అమావాస్య చంద్రుడు
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
అమిత్ షా రేస్ లో... తుస్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
చంద్రబాబు నెంబర్ వన్..
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
బాబు ఏమన్నా గాంధీనా?
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments