నల్లారి పెళ్లి… మళ్లీ మళ్లీ

Nallari Kiran Kumar Reddy pronounce Malli Pelli

విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని మనలో చాలా మంది మరిచిపోయారు. తెలంగాణ ఉద్యమం ఊపులో ఉన్నప్పుడు ఉద్యమానికి దీటుగా ప్రభుత్వాన్ని నడిపించారు నల్లారి. కేసీఆర్ ఉద్యమాన్ని ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నా కానీ మొక్కవోని దైర్యంతో ప్రభుత్వాన్ని నడిపించారు. చివరకు కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యడం, కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా మారారు.

తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ గా సంచలనం రేపుతున్నాయి. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా మెలిగిన నల్లారి వారి ఫ్యామిలీ ఇప్పుడు పెళ్లి గురించి ఆసక్తికర చర్చ సాగిది. ఏంటి నల్లారి వారి ఇంట్లో ఏమైనా పెళ్లి వేడుకలు ఉన్నాయా.? అని అనుకుంటున్నారేమో. అదేంకాదు నల్లారి వారు చాలా రోజుల తర్వాత తమ ముందుకు వచ్చేసరికి ఓ యువ నాయకుడు త‌న మ‌న‌సులోని మాట‌ను కిర‌ణ్ ముందు పెట్టేశార‌ట‌. ”మ‌మ్మ‌ల్ని ఏదో ఒక పార్టీలోకి తోసేయండి. ఆ పార్టీని ప‌ట్టుకుని అయినా వేలాడుతుంటాం. ఏమీ చెప్ప‌క‌పోతే ఎలా?” అని అన్నారు. దానికి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన సమాధానం వింటే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.

ఇంతకీ కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే.. ”ఇప్ప‌టికే పెళ్లి గురించి మాట్లాడాం. అయితే పెళ్లి కూతురు పేరు మాత్రం ప్రస్తుతానికి గోప్యం. తాళిబొట్టు క‌ట్టే తేదీ ఖ‌రారైతే… మీకంద‌రికి శుభ‌లేఖ‌లు వ‌స్తాయి. అంత తొంద‌రెందుకు? ” అని అన్నారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి గతంలో చెప్పుల గుర్తుతో పెట్టిన జై సమైకాంధ్ర పార్టీ తిరిగి ప్రారంభిస్తారా అనే ప్రశ్న తలెత్తింది. ఇక మరికొంత మంది మాత్రం తన పాత పార్టీ కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ గా మారనున్నారు అని టాక్. మొత్తానికి నల్లారి వారి స్టేట్ మెంట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Related posts:
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
నారా వారి నరకాసుర పాలన
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
మావో నాయకుడు ఆర్కే క్షేమం
ఏపీకి ఆ అర్హత లేదా?
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు

Comments

comments