షాకిచ్చిన నారా బ్రాహ్మణి… టిడిపిలో గుబులు స్టార్ట్

Nara Bhahmini shocks to TDP and Chandrababu Naidu

టిడిపిలో అందరికి కొత్త చర్చకు నారా బ్రాహ్మణి అవకాశాన్ని కల్పించారు. నిజానికి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండే నారా బ్రాహ్మణి తాజాగా ఓ అంశం మీద తలదూర్చారని, ఆమె వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు, టిడిపిలో భయం పట్టుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. విభజన తర్వాత ఏపిలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టింది. కాగా రెండున్నర సంవత్సరాల తర్వాత నారా బ్రాహ్మణి వల్ల ఇప్పుడు టిడిపి వర్గాల్లో భయం పట్టుకుంది. బ్రాహ్మణి వల్ల నిజం తెలిసిందనో లేదంటే ఆమె వల్ల భవిష్యత్తు తెలిసిందనో తెలియదు కానీ మొత్తానికి తెలుగు తమ్ముళ్లలో మాత్రం గుబులుపట్టుకుంది.

తెలుగుదేశం పార్టీ  త‌న రెండున్నర సంవత్సాల పాల‌న‌ను పూర్తి చేసుకోబోతోంది. ఈ నేప‌థ్యంలో పార్టీ ప‌రిస్థితిపై ప‌లు స‌ర్వేలు రిపోర్టులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అయితే కొన్ని టీడీపీ చేయించుకోగా.. మరికొన్ని ఆ పార్టీ నేత‌లు చేయించుకుంటున్న‌వే. మొత్తంగా చూసుకుంటే ఆ ఆపార్టీ స‌ర్వే రిపోర్టులు టీడీపీ గాలి తీస్తున్నాయి.  ఇదిలా ఉంటే ముఖ్య‌మంత్రి కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి ఎవ‌రికీ తెలియ‌కుండా ఒక స‌ర్వే చేయించిన‌ట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిపిన ఈ సర్వే లో తెలుగుదేశం పార్టీని కలవర పెట్టే ఫలితాలే వచ్చినట్టుగా మీడియా వర్గాల మధ్య ప్రచారం జరుగుతోంది.

గత రెండున్నర సంవత్సరాల తర్వాత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉన్నట్టుండి ఎన్నికలు వస్తే మాత్రం పార్టీకి తీవ్ర నష్టం తప్పదు అని తేలినట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీ కి 57 సీట్లకు మించి రావ‌ని ఈ అధ్యయనం తేల్చిందని సమాచారం. బాబు పాలన విషయంలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందనే విషయానికి అద్దం పడుతున్న ఈ రిపోర్టుల  వివరాలను బ్రాహ్మ‌ణి చంద్రబాబు దృష్టికి తీసుకుళ్లిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే మిగిలిన నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ జయకేతనం ఎగరేసే అవకాశాలున్నాయని ఈ సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. మొత్తానికి నారా బ్రాహ్మణి రిపోర్ట్ తో చంద్రబాబు అండ్ కో కు చెమటలు పడుతున్నట్లు సమాచారం. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
గులాబీవనంలో కమలం?
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
ఏపిలో జగన్ Vs పవన్
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!

Comments

comments