ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?

Nara Brahmini as AP Cheif Minister

ఏపీ రాజకీయాల మాటెలా వున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది.అయన కూడా ఇటీవల కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలని నేతలు,అధికారులకి కూడా హితబోధ చేయడం చూస్తున్నాం.కుటుంబం పరిస్థితి బాగుంటేనే కదా ఆ సంతోషంతో ఇలాంటి మాటలు చెప్పేది.. కానీ మరో ఆరునెలల్లో బాబు కుటుంబ పరిస్థితులు మారిపోతాయంటున్నారు ఓ జ్యోతిష్కుడు..పేరు పరాంకుశం వేణు స్వామి.

2017 ఫిబ్రవరి లో అనారోగ్యం వల్ల బాబు అధికారానికి దూరం అవుతారని …అప్పుడు ఓ మహిళ వల్ల కుటుంబంలో కూడా స్పర్ధలు తప్పవని అయన అంటున్నారు.జాతకరీత్యా చూస్తే బాబు వారసురాలిగా బాలయ్య లేదా బ్రాహ్మణి సీఎం పీఠాన్ని అధిష్టించే అవకాశాలున్నాయని వేణు స్వామి జోస్యం.ఆ ఇద్దరిలో కూడా బ్రాహ్మణికే అవకాశాలు ఎక్కువని …బాబు కూడా ఆమె వైపే మొగ్గుతారని అయన చెప్తున్నారు.లోకేష్ తో పోలిస్తే బ్రాహ్మణి రాజయోగం బలమైందని కూడా ఓ ఆన్ లైన్ టీవీ లో సదరు జ్యోతిష్కుడు సెలవిచ్చాడు.ఇది ఆ స్వామి ఊహా?లేక జోస్యమా? అన్నది మరో ఆరు నెలల్లో తేలిపోతుంది.

అయితే ఆయన చెప్పింది జ్యోతిషం ప్రకారం కాకున్నా జరుగుతున్న పరిణామాల ఆధారంగా చూసినా ఇది జరిగే అవకాశాలున్నాయని కొంత మంది భావిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు జైలుకు వెళితే ఆయన స్థానంలో నారా బ్రాహ్మణిని కూర్చోబెడతారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే చంద్రబాబు అనూహ్యంగా నారా బ్రాహ్మణి పేరును తెరమీదకు తీసుకువస్తున్నారని తెలుస్తోంది. మొన్నామధ్యన పార్టీ పరిస్థితి మీద నారా బ్రాహ్మణి సర్వే చేసిందనే వార్తను ప్రచారం చెయ్యడం ఇందులో భాగమే అని అనిపిస్తోంది.

Related posts:
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
గులాబీవనంలో కమలం?
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
అహా... అందుకేనా..?!
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
బాబుగారి చిరు ప్లాన్
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
మన ఖాతాలే మోదీ టార్గెట్?
ఓటుకు నోటు కేసును మూసేశారా?
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments